తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2019-20లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,28,216 ఉండగా... అదే ఆర్థిక ఏడాదిలో దేశ తలసరి ఆదాయం రూ.1,35,050 ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.93,166 ఎక్కువ అని వెల్లడించారు. ఇది రాష్ట్ర ప్రగతికి స్పష్టమైన సంకేతంగా పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు