ETV Bharat / state

కరోనా లక్షణాలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స : మంత్రి ఈటల

లాక్​డౌన్​ను సంపూర్ణంగా అమలు చేసిన ఘనత తెలంగాణదే అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 5న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో లాక్​డౌన్ అమలు, పొడిగింపుపై చర్చిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ పరిధిలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఇకపై జీహెచ్​ఎంసీ పరిధిలో లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

author img

By

Published : May 1, 2020, 7:34 PM IST

ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే నడుకుంటున్నాం : మంత్రి ఈటల

లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలును సమాజంలోని అన్ని వర్గాలు ప్రశంసించాయని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని గుర్తించి దేశాన్ని అప్రమత్తం చేసిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. 22 మినహా మిగతా కరోనా పాజిటివ్ కేసులన్నీ గుర్తించామన్నారు. ఈ 22 మందికీ కరోనా ఎలా సోకిందో త్వరలోనే గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయవద్దని ఐసీఎంఆర్ సూచించిందన్నారు. ఏదైనా ఇంట్లో కరోనా పాజిటివ్ వస్తేనే పరీక్షలు చేయాలని చెప్పిందన్నారు. కరోనా లక్షణాలు ఉంటేనే ఆస్పత్రిలో చికిత్స చేయాలని ఐసీఎంఆర్ వెల్లడించిందన్నారు.

ఎలాంటి పరిస్ధితైనా ఎదుర్కొంటాం...

కరోనా పాజిటివ్ వచ్చి లక్షణాలు లేకుంటే ఇంట్లోనే చికిత్స చేయాలని తెలిపింది. టెస్టులు చేయకపోవడం వల్లే తక్కువ కేసులనే ఆరోపణలు నిజం కాదని మంత్రి కొట్టిపడేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్‌ అందరినీ అప్రమత్తం చేశారని అన్నారు. కరోనా ఇక్కడ పుట్టింది కాదని, విమానాలు రద్దు చేయాలని తొలుత ప్రధాని మోదీకి సూచించింది సీఎం కేసీఆరే అని మంత్రి ఈటల వివరించారు. సీఎం పిలుపుతో ప్రతి పల్లె కరోనా కట్టడికి స్వచ్ఛందంగా కదిలిందన్నారు. 14 రోజుల పాటు గ్రామాల్లోకి ఎవరూ రాకుండా కంచెలు వేసి ఎవరికి వారే వైరస్ నివారణకు కృషి చేశారని అన్నారు.

కరోనా కేసులు దాస్తే దాగవు !

కరోనా కేసులు, మరణాలు దాస్తే దాగేవి కావని మంత్రి అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లో చేపట్టినట్లు హైదరాబాద్‌లోనూ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వస్తే చనిపోతామన్న ఆందోళన వద్దని మంత్రి భరోసా ఇచ్చారు. లాక్‌డౌన్ అంశంపై మే 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

హైదరాబాద్​లో ఆంక్షలు కఠినం...

సూర్యాపేట మాదిరిగా హైదరాబాద్‌లోనూ ప్రత్యేక అధికారిని నియమిస్తామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని అన్నారు. మర్కజ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వమే అనుమతిచ్చిందని ఈటల చెప్పారు. మర్కజ్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేశామని ఆయన వివరించారు. రాష్ట్రంలో 90 శాతం కరోనా కేసులు మర్కజ్‌ నుంచి వచ్చినవేనన్నారు.

ఇవీ చూడండి : ఆంధ్రప్రదేశ్​లోని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.