ETV Bharat / state

Telangana Excise Department: అస్తవ్యస్తంగా పరిపాలన... 4 నెలలైనా రాని పోస్టింగ్‌లు

author img

By

Published : Oct 5, 2021, 10:08 AM IST

రాష్ట్ర ఆబ్కారీ శాఖ (Telangana Excise Department) పరిపాలన అస్తవ్యస్తంగా తయారయింది. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వారికి పొస్టింగ్‌లు, జీతాలు రెండూ లేవు. పదోన్నతి పొందిన అధికారులకు నాలుగు నెలలైనా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. మంత్రి వద్దకు వెళ్లిన దస్త్రం వెనక్కి రావడంతో పొస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న అధికారుల్లో (Telangana Excise Department) ఆందోళన మొదలైంది.

Telangana Excise Department
రాష్ట్ర ఆబ్కారీ శాఖ

రాష్ట్ర ఆబ్కారీ శాఖ (Telangana Excise Department)లో పోస్టింగ్‌ల కోసం అధికారుల నిరీక్షణ కొనసాగుతోంది. నాలుగు నెలల కిందట పదోన్నతులు (Promotions) పొందిన పలువురు అధికారులకు ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. నాలుగు నెలలు కిందట 68మంది అధికారులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు (Promotions) వచ్చాయి. అందులో 12 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా అలానే ఉంచారు. వారంతా పాత పోస్టింగ్‌ల్లోనే పని చేస్తున్నారు. కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చి... మిగిలిన వారికి ఇవ్వకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో మిగిలిన అధికారులకు పోస్టింగ్‌లు కల్పించేందుకు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ (Director of Excise Sarfaraz Ahmed) ప్రాథమికంగా కసరత్తు చేసి దస్త్రాన్ని (File of postings) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి పంపించారు.

ఆ దస్త్రం (File of postings) చాలా రోజులపాటు కార్యాలయంలోనే ఉండిపోయింది. ఇటీవల మంత్రి పేషీ నుంచి ఇదే విషయమై ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి లేఖ వెళ్లింది. దీంతో ఒక్క రోజులోనే పోస్టింగ్‌లు కొలిక్కి వస్తాయనే భావన అధికారుల్లో వ్యక్తమైంది. కానీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం వెంటనే స్పందించలేదు. ఎట్టకేలకు ఆగస్టులో పోస్టింగ్‌ల దస్త్రాన్ని (File of postings) మంత్రి పేషీకి పంపించింది. అయితే ఆ పోస్టింగ్‌ల దస్త్రం మంత్రి పేషిలో ఆమోదం పొందలేదు. అంతే కాదు ఇటీవలే ఆ దస్త్రం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి చేరింది.

ఎక్సైజ్‌ శాఖ (Telangana Excise Department) ఉన్నతాధికారులు సూచించిన పోస్టింగ్‌లపై అభ్యంతరాలు ఉండడంతోనే మంత్రి పేషీలో ఆ దస్త్రానికి ఆమోదం లభించలేదన్న ప్రచారం జరుగుతోంది. అందులో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమనే ఉద్దేశంతోనే దస్త్రాన్ని తిరిగి పంపినట్లు వినిపిస్తోంది. పోస్టింగ్‌ల దస్త్రం (File of postings) ఇలా అటూ ఇటూ చక్కర్లు కొడుతుండటం చర్చ నీయాంశంగా మారింది. నెలల తరబడి పోస్టింగ్‌లు లేక ఆబ్కారీ భవన్‌ (Telangana Excise Department)కే పరిమితమైన పలువురు అధికారులకు మాత్రం తాజా పరిణామం మరింత ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇదీ చూడండి: EXCISE DEPARTMENT: అస్తవ్యస్తంగా ఆబ్కారీ పాలనా వ్యవస్థ.. పోస్టింగ్‌లపై కోల్డ్​వార్​!

excise department on drugs case: ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం!.. డ్రగ్స్​ కేసులో అభియోగపత్రాల విచారణలో జాప్యం

రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు

ఖరీదైన మద్యం బ్రాండ్ల ఖాళీ సీసాలతో అక్రమ వ్యాపారం

ఆబ్కారీ శాఖతో.. తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.