ETV Bharat / state

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్ - రేవంత్​రెడ్డి తాజా వార్తలు

Revanth reddy tweet on Kodangal Victory : కొడంగల్​లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ట్వీట్ చేశారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని... కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తానని ట్వీట్ చేశారు.

Revanth reddy
Revanth reddy tweet on Kodangal Victory
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 4:33 PM IST

Updated : Dec 3, 2023, 8:36 PM IST

Revanth reddy tweet on Kodangal Victory : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ప్రజలు బీఆర్​ఎస్​కు షాకిచ్చి కాంగ్రెస్​కు(Congress Victory) అధికారం కట్టబెట్టారు. కొడంగల్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విజయం సాధించారు. 31,849 ఓట్ల మెజారిటీతో బీఆర్​ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ ​రెడ్డిపై విజయం సాధించారు.

కొడంగల్​లో గెలుపుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth reddy) ట్వీట్ చేశారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని రేవంత్​రెడ్డి తన ట్వీట్​లో పేర్కొన్నారు. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని.. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతానని హామీ ఇచ్చారు.

  • ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.

    కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.

    ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే… pic.twitter.com/v9hcZ4VpB3

    — Revanth Reddy (@revanth_anumula) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Revanth reddy tweet on Congress Victory : కాంగ్రెస్ విజయంపై రేవంత్​ రెడ్డి మరో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్దమైన పాలన అందిస్తుందని హామీ ఇచ్చిందంటూ పేర్కొన్నారు. ఈ మాటకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకుని అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలుపుతామని తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Telangana Assembly Elections Result Live 2023 : హైదరాబాద్ చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గచ్చిబౌలి హోటల్​లో మకాం

Revanth Reddy Pressmeet Today : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న వేళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి గాంధీభవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రగతి భవన్ - అంబేడ్కర్ ప్రజా భవన్​గా మారనుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా తీర్పును ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే చర్యలకు అన్ని పార్టీలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు.

Revanth Reddy On Congress Victory in Telangana 2023 : 2009 డిసెంబరు 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్​కు అవకాశం వచ్చిందన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజులు సాగిందని, ఈ యాత్ర ద్వారా రాహుల్ తమలో స్ఫూర్తిని నిలిపారని రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. రాహుల్, సోనియా, ప్రియాంకలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉందని చెప్పారు. తనను, భట్టి విక్రమార్కను రాహుల్​గాంధీ వెన్నుతట్టి ప్రోత్సహించారని వెల్లడించారు.

  • కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు… ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్దమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చింది.

    ఆ మాటకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో రాజీ పడబోమని ప్రజలకు మరోసారి మాట ఇస్తున్నాం.

    ప్రతిపక్ష పార్టీలను కూడా సమన్వయం చేసుకుని అభివృద్ధిలో రాష్ట్రాన్ని… pic.twitter.com/dPal9EFbXM

Telangana Assembly Election Results 2023 Live Updates : తెలంగాణలో హస్తానిదే అధికారం - కాంగ్రెస్​ గెలుపునకు దారితీసిన అంశాలివే

Last Updated : Dec 3, 2023, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.