ETV Bharat / state

Telangana Election Results Live 2023 : కాయ్ రాజా కాయ్ - ఎన్నికల ఫలితాల వేళ జోరుగా బెట్టింగ్‌​ - election betting on telangana election result

Telangana Election Result 2023 Live : ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. సీఎం ఎవరవుతారు. ఇప్పుడు అందరి నోటా ఇదే మాట. అయితే కానీ రాష్ట్రంలో 2023లో జరిగిన ఎన్నికలు ఏకంగా బెట్టింగులకే దారి తీశాయి. అంటే రాజకీయాలు అంత ఇంట్రెస్టింగ్​గా ఉన్నాయి. ఇంతకి ఆ బెట్టింగులు ఎక్కడ జరుగుతున్నాయి. ఎంత బెట్టింగ్ వేస్తున్నారో తెలుసా?

Telangana Election Betting
Telangana Assembly Election Result 2023 Live
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 11:11 AM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Telangana Election Result 2023 Live : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పోటీలో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అభ్యర్థుల భవిత్యం ఈవీఎంలలో దాగి ఉండడంతో గెలుపు అవకాశాలపై జోరుగా బెట్టింగ్ సాగుతుంది. ప్రధానంగా పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బుకీలు లేకపోయినప్పటికీ స్థానికంగా బెట్టింగులు కాస్తున్నారు. గ్రామాల్లో కొందరు ఆ పందేలకు తెరతీసినట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో రూ.500 నుంచి రూ.2వేల మధ్య ఓట్లతో గెలిచే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ వేసినవారికి ఉత్కంఠ నెలకొంది.

Betting in Telangana Election 2023 : రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించిన కొడంగల్​పై బెట్టింగ్​ జోరుగా కొనసాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్​నగర్​, వనపర్తి నియోజకవర్గాల్లోనూ స్థానికులు కొందరు లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో పందాలు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నియోజకవర్గాల్లో రూ.50వేల వరకు గెలుపుపై పందాలు కాస్తున్నారు.

Betting On Telangana Elections in AP : పక్క రాష్ట్రానికి చెందినవారు ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జడ్చర్ల, దేవరకద్ర, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో రెండు ముఖ్య పార్టీల మధ్య పోరు నడుస్తోంది. ఇక్కడ తక్కువ ఓట్లతో ఏ పార్టీ అభ్యర్థి అయినా గెలవచ్చన్న ప్రచారం జరుగుతుండటంతో పలువురు ఈ నియోజకవర్గాలపై పందేలకు ఎక్కువగా పాల్పడుతున్నారు.

కోటికి అయిదు కోట్లు - తెలంగాణ ఎన్నికలపై రంగంలోకి దిగిన బెట్టింగ్ గ్యాంగ్​లు -ప్రత్యేక గ్రూపులు, యాప్​లు

ఈ నియోజకవర్గాల్లో రూ.10వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్ ధర పలుకుతోంది. క్రికెట్​ బెట్టింగ్​లకు తలపించేలా ఎన్నికల పందాలు సాగుతోంది. క్రికెట్​ బెట్టింగ్​ల్లో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులే ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో క్రికెట్​ బెట్టింగ్ అడ్డాలనే దీనికి వాడుతున్నారు.

బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

గ్రామాలు, పట్టణాల్లో బెట్టింగ్​లను వాట్సాప్​, చరవాణిల ద్వారానే ఎక్కువగా సాగిస్తున్నట్లు సమాచారం. కొందరు దీన్ని వ్యాపారంగా తీసుకుని కమీషన్లు దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఎన్ని స్థానాలకు ఏ పార్టికీ వస్తాయి? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఎన్ని ఓట్ల మేజార్టీతో గెలుస్తారు..? రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది? సీఎం ఎవరు? అన్నదానిపై జోరుగా బెట్టింగ్​లు కాస్తున్నారు.

ఓపెన్‌ చేసి ఉన్న పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు - ఆందోళనలో కాంగ్రెస్‌ నేతలు

ప్రధాన పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు జోరుగా పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చాయ్ అడ్డాలే కేంద్రంగా ఈ బెట్టింగ్​లు కాస్తున్నారు. కౌంటింగ్​కు ద్వితీయశ్రేణి నాయకులు కొందరు జోరుగా బెట్టింగ్​లు కాస్తున్నట్లు సమాచారం. మరో రోజు గడువు ఉండటంతో ఈ బెట్టింగ్​లకు పాల్పడే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఫలితాలపై పూర్తి ధీమాతో గులాబీ దళపతి - ప్రగతిభవన్​కు రంగులు దానికి సంకేతమేనా?

ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలోకి ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.