ETV Bharat / state

రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం - Telangana Assembly Elections

Telangana Election Campaign in Full Josh : శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారాల్లో జోరు పెంచారు. ఊరు - వాడ తిరుగుతూ.. అందర్నీ పలకరిస్తూ ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో రోడ్‌షోలు నిర్వహిస్తుంటే.. నియోజకవర్గ అభ్యర్థులు మేనిఫెస్టో వివరిస్తూ.. తమకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు.

BJP Election Campaign 2023
Telangana Election Campaign in Full Josh
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 9:11 PM IST

రాష్ట్ర శాసనసభ సమరంలో హోరాహోరీ - ప్రచారంతో కదం తొక్కిన బంధుజనం

Telangana Election Campaign in Full Josh : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్‌ సనత్ నగర్ నియోజకవర్గం అమీర్‌పేట్‌ డివిజన్లోని పలు బస్తీలలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొమ్మిదేళ్ల సంక్షేమ పథకాలు(Welfare Schemes) ప్రజలకు వివరిస్తూ.. తమకు ఓటేసి గెలిపించాలని కోరారు.

హస్తం పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటును కాంగ్రెస్‌ కాకి ఎత్తుకుపోతుంది : కేసీఆర్‌

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలంలోని పలుగ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన మంత్రికి ప్రజలు బోనాలతో ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్(BRS Party) అభ్యర్థి కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులతో కలిసి మాట్లాడిన చందర్‌.. గులాబీ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

BRS Election Campaign 2023 : హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ(Door to Door) తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని సికింద్రాబాద్‌ ఆ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ కొడంగల్‌ ఇంత పొడవు ఉందని, నా మీద కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి పోటీ : సీఎం కేసీఆర్‌

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 24వ డివిజన్లో తుమ్మల ప్రసంగిస్తుండగా.. అదే రోడ్డులో రోడ్‌ షో నిర్వహిస్తూ.. మంత్రి అజయ్‌కుమార్‌ వచ్చారు. దీంతో పోటాపోటీగా ఇద్దరు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.

అభివృద్ధిని చూసి దయచేసి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే. గత అరవై సంవత్సరాల కాలంలో వారు దేశానికి ఏమీ చేయలేదు. పేదరికంలోకి నెట్టారు. వారి పరిపాలనలో నిరుద్యోగం, మతకలహాలు, నీటి కరవు, కరెంట్ లేకపోవడం వంటివి జరిగాయి. దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాలు ఇంకా పేదరికంలోకి జారుకోవడం జరిగాయి.-పువ్వాడ అజయ్‌కుమార్‌, మంత్రి

Congress Six Guarantees Campaign : మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని పలుగ్రామాల్లో ప్రచారం చేపట్టారు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఓటర్లకు పంచుతూ.. ఓట్లు అభ్యర్థించారు.

కవితను ఓడించారని నిజామాబాద్‌ జిల్లా ప్రజలపై కేసీఆర్ పగబట్టారు: రేవంత్​రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలుగ్రామాలలో హస్తం పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

BJP Election Campaign 2023 : గులాబీ తోటలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ముషీరాబాద్‌లో కమలం పార్టీ అభ్యర్థి పూసరాజు కుటుంబసభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో తుంగతుర్తి బీజేపీ అభ్యర్థి కడియం రాంచంద్రయ్య గెలుపును కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో కమలం పార్టీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు(Pamphlets) పంపిణీ చేస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దుబ్బాక రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం వస్తారు : కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.