Telangana Congress Minority Declaration 2023 : తెలంగాణలో అధికారం ఛేజిక్కించుకోవడమే లక్ష్యంగా వర్గాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మరో డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇప్పటికే యువ, రైతు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి నేడు మైనార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మాదిరిగా మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.4 వేల కోట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్న ఆయన.. మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ముస్లింలకు అనేక అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. వక్ఫ్ భూములను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్‌కు టికెట్ కేటాయిస్తే.. పోటీగా ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి కాకుండా.. ఎంఐఎం కేసీఆర్‌కు మద్దతు ఇస్తోందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై మాత్రం ఎంఐఎం పోటీ చేయదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని శపథం చేశారు.
Congress warangal Declaration: జనంలోకి వరంగల్ డిక్లరేషన్.. నెల రోజుల పాటు రైతు రచ్చబండ
మైనార్టీ డిక్లరేషన్‌లోని ముఖ్యంశాలు..:
- మైనార్టీలకు ఆర్థిక ఉద్ధరణ, సాధికారత
- 6 నెలల్లోపు కుల గణనను చేపట్టి.. ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనార్టీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు
- మైనార్టీల సంక్షేమ బడ్జెట్‌ను రూ.4,000 కోట్లకు పెంచడంతో పాటు ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్
- నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడం కోసం సంవత్సరానికి 1,000 కోట్లు
- విద్య, ఉపాధి ఈక్విటీకి నిబద్ధత
- అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం
- ఎంఫిల్ చేసిన మైనార్టీ యువతకు రూ.5 లక్షల సాయం
- పీహెచ్‌డీ, పీజీ చేసిన మైనార్టీ యువతకు రూ.లక్ష సాయం
- సిక్కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ
- మైనార్టీ సంస్థల్లో ఖాళీల భర్తీకి హామీ
- ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
- అన్ని మతాల పూజారులకు నెలకు రూ.పది నుంచి రూ.12 వేల గౌరవ వేతనం
- ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి
- ఇళ్లులేని మైనార్టీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం
- ఇళ్లు లేని మైనార్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
- మైనార్టీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు రూ.1.6 లక్షల సాయం
- మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ
- పాత బస్తీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
Warangal Declaration: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్.. అధికారంలోకి రాగానే రూ. 2లక్షల రుణమాఫీ