ETV Bharat / state

ధరణి స్థానంలో 'భూమాత'.. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్​నెట్‌ - రేపే కాంగ్రెస్​ మేనిఫెస్టో

Telangana Congress Manifesto 2023 : అధికారంలోకి రాగానే ఏటా జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్​నెట్ కల్పించనున్నట్లు ప్రకటించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ 'ప్రజా దర్బార్‌' నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రేపు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

telangana assembly elections 2023
Telangana Congress Manifesto 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 5:20 PM IST

Telangana Congress Manifesto 2023 : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా దూసుకుపోతున్న హస్తం పార్టీ.. రేపు మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రస్తుతం ఉన్న ఆరు గ్యారంటీలకు అనుబంధంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఏటా జాబ్​ క్యాలెండర్​ విడుదల చేయడంతో పాటు పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో పొందుపర్చారు. ధరణిని తీసేసి, దాని స్థానంలో భూమాత పోర్టల్​ ప్రవేశపెట్టనున్నట్లు అందులో తెలిపారు. ఇంకా మేనిఫెస్టోలో ఏమేం ఉన్నాయంటే..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం : రేవంత్​రెడ్డి

కాంగ్రెస్​ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..

  • ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల.. పారదర్శకంగా నియామక ప్రక్రియ
  • విద్యార్థులందరికీ ఉచితంగా ఇంటర్​నెట్‌ సదుపాయం
  • బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధుల కేటాయింపు
  • మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం
  • మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలల పునః ప్రారంభం
  • కొత్తగా 4 ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు
  • ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి మోకాలి సర్జరీ
  • ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరించి.. మెరుగైన వైద్య సేవలు
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌
  • భూ హక్కుల సమస్యల పరిష్కరానికి ల్యాండ్‌ కమిషన్‌ ఏర్పాటు
  • పేదలకు పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి హక్కులు
  • సర్పంచుల ఖాతాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధుల జమ
  • గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌ డీఏల చెల్లింపు
  • సీపీఎస్‌ రద్దు చేసి.. దాని స్థానంలో ఓపీఎస్‌ అమల్లోకి
  • కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి.. 6 నెలల్లో అమలు

తెలంగాణపై ఏఐసీసీ బృందాల ఫోకస్‌ - అభ్యర్థులతో సంబంధం లేకుండా తెరవెనుక రాజకీయం

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని మరికొన్ని ప్రతిపాదిత హామీలు

  • ఆరు గ్యారంటీలకు అనుబంధంగా మేనిఫెస్టో విడుదల
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ 'ప్రజా దర్బార్‌' నిర్వహణ
  • తెలంగాణ ఉద్యమవీరుల కుటుంబాలకు నెలవారీ గౌరవ పింఛను
  • ఉద్యమ అమరవీరుల కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛను
  • ఉద్యమ అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  • తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేత
  • తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి 250 గజాల ఇంటి స్థలం
  • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ
  • రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పంపిణీ
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌
  • అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకం అమలు
  • దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్‌ హైకోర్టు జడ్జితో విచారణ
  • గ్రామ పంచాయతీలకు చెరువుల నిర్వహణ, మరమ్మత్తుల బాధ్యతలు
  • చెరువుల నిర్వహణకు గ్రామ పంచాయతీలకు తగినన్ని నిధులు
  • మెగా డీఎస్సీని ప్రకటించి.. 6 నెలల్లో ఖాళీ టీచర్‌ పోస్టుల భర్తీ

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.