ETV Bharat / state

Telangana Congress Candidates Selection 2023 : రెండో జాబితాపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు.. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

Telangana Congress Candidates Selection 2023 : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు బుధవారం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితా 55 నియోజవర్గాలను మినహాయిస్తే మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది. కాంగ్రెస్‌ సీఈసీ సమావేశానికి ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు.. జటిలంగా మారిన నియోజకవర్గాల్లో రెండు పేర్లను కూడా స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Congress Candidates Selection 2023
Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 8:04 AM IST

Telangana Congress Candidates Selection 2023 రెండో జాబితాపై కాంగ్రెస్ సుదీర్ఘంగా కసరత్తు.. బుధవారం ఈసీ ఆమోదముద్ర

Telangana Congress Candidates Selection 2023 : రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజుకురోజుకూ పెరుగుతోంది. రాజకీయ పార్టీల ప్రచారం జోరు అందుకుంది. అధికార బీఆర్​ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించి బీ-ఫారాలు కూడా అందించి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంది. మరొకవైపు భారతీయ జనతా పార్టీ(BJP) 52 పేర్లతో మొదటి జాబితాను ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా పది రోజుల క్రితం 55 పేర్లతో మొదటి జాబితా(Congress MLA Candiadates List)ను ప్రకటించిన కాంగ్రెస్.. రెండో జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రతరం చేసింది.

Telangana Congress MLA Candidates Second List 2023 : శని, ఆదివారాలలో దిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ.. ఛైర్మన్ మురళీధరన్, ఇద్దరు సభ్యులు, రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయ వ్యూహ కర్త సునీల్ కనుగోలు తదితరులు ఉన్నారు. రెండో జాబితా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేర్లను పార్టీ ఎన్నికల కమిటీకి పంపాల్సిన పరిస్థితులు స్క్రీనింగ్ కమిటీ(Congress Screening Committee)లో ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది.

Telangana Congress Candidates Selection 2023 : 64 సీట్లపై తర్జన భర్జన.. నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రతిష్ఠంభన!

Congress Candidates Second List in Telangana : స్క్రీనింగ్ కమిటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై చర్చ వచ్చినప్పుడు ప్రతికూల, అనుకూల వర్గాలు గట్టిగా తమ వాదనలను వినిపించి తమకు అనుకూలమైన నాయకులను ఎంపిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్‌పేట, ఎల్బీ నగర్‌, నర్సాపూర్‌ తదితర పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు సముజ్జీలు ఉండడం, ఏకాభి ప్రాయం కుదరకపోవడంతో ఎటు తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

Telangana Assembly Elections 2023 : మరోవైపు వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాలను వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా లేనట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో వామపక్షాల నాయకులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

Telangana Congress MLA Candidates Second List : అభ్యర్థుల ఎంపికపై నేడు మరోసారి కసరత్తు.. 2, 3 రోజుల్లో రెండో జాబితా విడుదల!

మరొకవైపు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి మరి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం దిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒక పేరు, రెండు పేర్ల జాబితాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 నియోజకవర్గాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బుధ, గురువారాల్లో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాలకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, చేరికలు పూర్తయితే మూడో జాబితాకు అడ్డు తొలిగి పోతుంది.

Telangana Congress Candidates Second List : కొలిక్కివచ్చిన కాంగ్రెస్ రెండో జాబితా.. ఈనెల 25న ప్రకటించే అవకాశం

Congress Screening Committee Meeting : 'మిగిలిన 64 నియోజకవర్గాలకు ఒకేసారి ప్రకటిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.