ETV Bharat / state

Telangana Congress Candidates Second List : కొలిక్కివచ్చిన కాంగ్రెస్ రెండో జాబితా.. ఈనెల 25న ప్రకటించే అవకాశం - కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా 2023

Telangana Congress Candidates Second List : తెలంగాణ కాంగ్రెస్‌ రెండో జాబితా అభ్యర్ధుల ప్రకటనపై.. స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజక వర్గాలకు ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో.. రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Congress Latest News
Telangana Congress Candidates Second List
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 6:46 PM IST

Congress MLA Candidates Second List : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దృష్టిసారించిన కాంగ్రెస్‌(Telangana Congress).. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేఫథ్యంలో మొదటి జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ.. రెండో జాబితాపై కసరత్తు ప్రారంభించింది. అభ్యర్ధుల ప్రకటనపై స్క్రీనింగ్‌ కమిటీ ఇవాళ దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో రెండో జాబితా తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

Congress Screening Committee Meeting : 'మిగిలిన 64 నియోజకవర్గాలకు ఒకేసారి ప్రకటిస్తాం'

Telangana Congress Latest News : మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మిగిలిన 64 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 35 నుంచి 40 నియోజక వర్గాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అదే రోజున అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023 : వామపక్షాలతో కాంగ్రెస్‌కు పొత్తులు కుదిరినా.. సీట్ల సర్దుబాటుపై పీట ముడి వీడలేదని తెలుస్తోంది. అయితే వరుసగా రెండో రోజు ఇవాళ కూడా సీట్ల సర్దుబాటుపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినప్పటికీ.. ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. వైరాకు బదులు పాలేరు సీటు కోసం సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

పాలేరు ఇవ్వడానికి ససేమిరా అంటున్నట్లు కాంగ్రెస్‌.. వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సీపీఎం నేతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటుపై మరొకసారి రాష్ట్ర నాయకత్వం వామపక్షాలతో కూర్చొని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. కీలక నేతలందరూ అక్కడి నుంచే పోటీకి సుముఖం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మొదటి జాబితాలో తమ పేర్లు ఉంటాయని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. రెండో జాబితాలో అయినా తమ పేర్లు వచ్చేట్లు చూసుకునేందుకు నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరికలు కూడా ఊపందుకున్నాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో బండి రమేష్‌, ఎమ్మెల్యే రేఖానాయక్‌, నారాయణ్‌రావు పటేల్ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్​రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

పలు నియోజకవర్గాలకు బలమైన నాయకులు పార్టీకి దొరికినట్లు కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారికి టికెట్లు ఇవ్వడంపై స్క్రీనింగ్ కమిటీ నాయకులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగాలంటూ ఓ వర్గం.. సీనియారిటీకి పెద్ద పీట వేయాలని మరో వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.

Congress Bus Yatra Ended in Telangana : ముగిసిన కాంగ్రెస్‌ బస్సు యాత్ర.. ప్రజల తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్న రాహుల్‌ గాంధీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.