ETV Bharat / state

ఐదు పథకాల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ, ఛైర్మన్​గా భట్టి - ప్రజాపాలనపై సీఎం సమీక్ష

Telangana CM and Ministers Discussion On Praja Palana : ప్రజాపాలన దరఖాస్తుల తదుపరి కార్యాచరణ, విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అర్హులను ఎంపిక చేసి అభయాస్తం పథకాలను అందించనుంది. ఈ నెలాఖరు కల్లా డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులైన వారందరికీ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను అమాత్యులు తిప్పికొట్టారు.

Sub Committee on Praja Palana
Telangana CM and Ministers Discussion On Praja Palana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 5:01 PM IST

Updated : Jan 8, 2024, 8:14 PM IST

ఐదు పథకాల అమలు కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ, ఛైర్మన్​గా భట్టి

Telangana CM and Ministers Discussion On Praja Palana : నిర్దిష్ట కాల వ్యవధిలో ఐదు పథకాల అమలు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విషయంలో రాజీపడబోమని పథకాల అమలులో అధికార యంత్రాంగం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రజాపాలన తదుపరి కార్యచరణ, పథకాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఎనిమిది రోజుల పాటు ఎలాంటి సమస్య తలెత్తకుండా 1.25 కోట్ల దరఖాస్తుల స్వీకరించిన అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అర్హులందరికీ పథకాల ఫలాలు అందే వరకూ పనిచేయాలన్నారు.

మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష - ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ

Sub Committee on Praja Palana Programme : ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపికపై సమీక్షలో చర్చించారు. ఐదు పథకాల అమలుపై మంత్రి వర్గం ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee)లో ఉంటారు. లబ్ధిదారుల ఎంపిక, పథకాల విధివిధానాలు, అర్హతల ఖరారుపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది. సిఫార్సులపై చర్చించి కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు.

నెలాఖరు వరకు డేటా ఎంట్రీ : దరఖాస్తుల్లోని సమాచారాన్ని రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో అధికారులు కంప్యూటరీకరిస్తున్నారు. సుమారు 30వేల మంది డేటాను ఎంట్రీ చేస్తున్నారు. ఈనెలాఖరు వరకు డేటా ఎంట్రీ పూర్తవుతుందని అధికారులకు సీఎం వివరించారు. దరఖాస్తుల్లోని ఆధార్, రేషన్ కార్డును అనుసంధానం చేయడం ద్వారా అర్హులను ప్రాథమికంగా గుర్తించవచ్చునని తెలిపారు. దరఖాస్తుల ఇంటింటి పరిశీలన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అధికారులు ఇంటికి వెళ్లి దరఖాస్తుల్లోని సమాచారం నిజమా, కాదా నిర్ధారిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

కోటి దాటిన ప్రజాపాలన దరఖాస్తులు - మరో మూడు పథకాల అమలుపై సర్కార్ కసరత్తు

Minister Ponnam Prabhakar on Praja Palana : ఇందిరమ్మ ఇళ్ల నమూనాను ఇంకా ఖరారు చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అందులో ఎలాంటి అనుమానం లేదని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికీ దరఖాస్తు చేయనివారుంటే రెవెన్యూ, మున్సిపల్‌, జోనల్‌ కార్యాలయాల్లో అభయ హస్తం అర్జీలు ఇవ్వొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

"ప్రతి గ్రామం, తండా నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువ సమయంలో విజయవంతంగా 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించాం."- పొంగులేటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మంత్రి

Ministers Fire on BRS Leaders : నెలరోజులు పూర్తికాని ప్రజా ప్రభుత్వంపై విపక్ష నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని అమాత్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ఏ వర్గానికీ న్యాయం చేయని భారాస నాయకులు గ్యారంటీల అమలుపై అసత్య ప్రచారం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడం మానకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) హెచ్చరించారు.

ముగిసిన ప్రజాపాలన- దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు

ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం?

Last Updated : Jan 8, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.