ETV Bharat / state

రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు.. బీసీ జాబితాలోకి మరో 17 కులాలు - రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదం తెలిపిన బిల్లులు

రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దుచేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. వీఆర్వో పోస్టులను రద్దు చేసేందుకు రూపొందించిన బిల్లును..... కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ భూమి, పట్టాదారు పాస్ పుస్తకాలపై చట్టం - 2020 పేరుతో రూపొందించిన నూతన రెవెన్యూ బిల్లుకు మంత్రి మండలి ఆమోద ముద్రవేసింది. బుధవారం కొత్త రెవెన్యూ బిల్లును శాసనసభలో సర్కారు ప్రవేశపెట్టనుంది. టీఎస్​-బీపాస్ బిల్లుకు పచ్చజెండా ఊపిన కేబినెట్‌.. బీసీ జాబితాలో 17 కులాలను చేర్చాలని కమిషన్ చేసిన సిఫార్సులను అంగీకరించింది.

రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు.. బీసీ జాబితాలోకి మరో 17 కులాలు

author img

By

Published : Sep 8, 2020, 5:01 AM IST

ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. రెవెన్యూ వ్యవస్థలో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయాలని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ వీఆర్వో పోస్టుల రద్దు బిల్లు-2020కి... కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

బుధవారం శాసనసభలో చర్చ..

రెవెన్యూ వ్యవస్థలో కీలక సంస్కరణలపై సుదీర్ఘ కసరత్తు చేసిన సర్కారు.... కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ఆమోదించింది. తెలంగాణ భూమి, పట్టాదారు పాసుపుస్తకాలపై హక్కుల పేరిట రూపొందించిన.. నూతన బిల్లుకు పచ్చజెండా ఊపింది. కొత్త రెవెన్యూ బిల్లును బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. టీఎస్​-బీపాస్​ బిల్లుకు ఆమోద ముద్రవేసింది. తెలంగాణ మున్సిపాల్టీ చట్టం -2019లోని సవరణ బిల్లుకు అంగీకారం తెలిపింది. గ్రామాల్లో వ్యవసాయేతర ఆస్తులబదిలీకి సంబంధించిన చట్టంలోని సవరణల కోసం రూపొందించిన బిల్లుకు ఆమోదముద్రవేసింది. తెలంగాణ జీఎస్టీ చట్టం 2017లో సవరణ బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తూ.. జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌ను... మంత్రి మండలి ఆమోదించింది.

పదవీ విరమణ వయోపరిమితి పెంపు:

ఉద్యోగులు, ఫించనర్ల వేతనాల్లో కోతకు సంబంధించిన... తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య అత్యవసర చట్టం - 2020 ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్రవేసింది. రుణ పరిమితి పెంపునకు సంబంధించిన ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ నిర్వహణ బిల్లును మంత్రిమండలి ఆమోదించింది. ఆయుష్ వైద్య కళశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను అంగీకరించింది. తెలంగాణ కోర్టు ఫీజులు, సూట్స్ వాల్యుయేషన్ చట్టం - 1956 సవరణ బిల్లు, తెలంగాణ సివిల్ కోర్టుల చట్టం -1972 సవరణ బిల్లుల ఆమోదించింది.

నవ తెలంగాణగా మార్చేందుకే..

దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి కలిగించి.. రాష్ట్రాన్ని నవ తెలంగాణగా మార్చేందుకే చట్టాల రూపకల్పనతోపాటు సంస్కరణలు చేపడుతున్నామని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. పాలన సజావుగా సాగడంతోపాటు ప్రజలకు అన్ని అంశాల్లో సౌలభ్యం కల్పించడమే వాటి లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం సహా ఇతర బిల్లుల నిర్ణయాల ఆవశ్యకతను మంత్రులకు.. సీఎం వివరించారు. ఇప్పటికే కొత్త పంచాయతీ రాజ్‌, పురపాలక చట్టాలు విజయవంతమయ్యాయని.. ప్రస్తుతం తేనున్న రెవెన్యూ చట్టం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రజా కోణంలోనే ఆ చట్టం తెచ్చినటలు కేసీఆర్‌ పేర్కొన్నారు.

కొత్త సచివాలయం నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేత ఖర్చులకు పరిపాలన అనుమతులను కేబినెట్ మంజూరుచేసింది. కొత్తగా నిర్మించే... సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలన అనుమతులిచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు అంగీకారం తెలిపింది. బీసీ జాబితాలో 17 కులాలను చేర్చాలంటూ.. బీసీ కమిషన్ చేసిన సిఫారసులను రాష్ట్ర మంత్రివర్గం అంగీకరించింది. కేబినెట్ ఆమోదించిన ఆ బిల్లులను.. ఈనెల 28 వరకు జరగనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్​ ఫారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.