ETV Bharat / state

అన్నిరంగాల అభివృద్ధే ధ్యేయంగా వార్షిక బడ్జెట్‌... - తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా 2020-21 సంవత్సరానికి గానూ పూర్తి వాస్తవిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. నాలుగేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.1,82,914 కోట్లతో పద్దును ప్రతిపాదించింది. మాంద్యం నేపథ్యంలోనూ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలే ప్రాతిపదికగా.. గతంతో పొలిస్తే దాదాపు 25శాతం వృద్ధితో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

telangana budget 2020 updates
ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలే ప్రాతిపదికగా బడ్జెట్‌
author img

By

Published : Mar 8, 2020, 7:46 PM IST

Updated : Mar 9, 2020, 6:26 AM IST

అన్నిరంగాల అభివృద్ధే ధ్యేయంగా వార్షిక బడ్జెట్‌...

రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా, ప్రజలే కేంద్రంగా.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు ప్రవేశపెట్టారు. చిట్టాపద్దు అంటే కాగితాల మీద వేసుకునే అంకెల వరుస కాదని... సామాజిక విలువల స్వరూపమని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న హరీశ్‌రావు.. బంగారు తెలంగాణకు బాటలు వేసేలా రూ.1,82,914 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేసీఆర్‌కున్న సమగ్రదృష్టిని, శ్రద్ధాశక్తుల్ని ఈ పద్దు ప్రతిబింబిస్తుందని మంత్రి హరీశ్‌ తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి ఎంతటి నిబద్ధతతో పాటుపడుతున్నామో చాటిచెబుతుందని పేర్కొన్నారు.

రాబడి రూ.1,43,151 కోట్లు..

2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయంలో రెవెన్యూ రాబడి రూ.1,43,151 కోట్లు ఉంటుందని అంచనా వేసిన సర్కారు.. రుణాలు సహా మూలధన రాబడులు రూ.39,550 కోట్లుగా వస్తాయని లెక్కకట్టింది. రెవెన్యూ రాబడిలో పన్నుల వాటా ద్వారా రూ.85,300కోట్లు, పన్నేతర రాబడి రూ.30,600కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.16,726కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రూ.10,525 కోట్లుగా అంచనా వేసింది. అప్పుల ద్వారా రూ. 35,500కోట్లు సమీకరించుకోవాలని ప్రతిపాదించింది.

వ్యయం రూ.1,38,669 కోట్లు..

ఈ ఆదాయంలో రెవెన్యూ వ్యయం రూ.1,38,669 కోట్లుగా లెక్కగట్టిన సర్కారు.. మూలధన వ్యయం రూ.22,061 కోట్లుగా అంచనా వేసింది. ఈ ఏడాది వడ్డీ చెల్లింపులకు రూ.14,615కోట్లు కేటాయించింది. పాత రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు రూ.15,662 కోట్లు ప్రతిపాదించింది. అన్ని ఖర్చులు పోనూ.. బడ్జెట్ అంచనాల్లో రూ.4,482 కోట్ల మిగులు తేలుతుందని లెక్కకట్టారు. ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్ల ఉంటుందని అంచనా వేశారు.

కేటాయింపులు ఇలా..

వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తామని శాసనసభ వేదికగా ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా సాగు రంగానికి కొత్త జవసత్వాలు కల్పించాలనే లక్ష్యంతో రైతుబంధుకు రూ.14 వేల కోట్లుతో అగ్రతాంబూలం అందించింది. రైతుబీమా కోసం రూ.1,141 కోట్లు, రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ.1,000 కోట్లు, సూక్ష్మ సేద్యం కోసం రూ.600 కోట్లు కేటాయించింది. రైతు వేదికల నిర్మాణానికి తొలిసారిగా రూ.350 కోట్లు ప్రతిపాదించింది. పాడి రైతుల ప్రోత్సాహకానికి రూ.100 కోట్లు, పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1,586.38 కోట్లును పద్దులో పెట్టింది.

సాగునీటి నుంచి సంక్షేమం వరకు..

ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా సాగు నీటి రంగానికి కేటాయింపులు చేసినట్లు బడ్జెట్​ ప్రసంగంలో మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో రూ.11,054 కోట్లు ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లు, ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.16,534.97 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధికి రూ.9,771.27 కోట్లు, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1,518.06 కోట్లు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రూ.4,356.82 కోట్లు కేటాయింపులు చేసింది

పల్లె నుంచి పట్టణ వరకు..

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.23,005 కోట్లు, పురపాలకశాఖకు రూ.14,809 కోట్లు, 38 మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథకు రూ.800 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లును పద్దులో ప్రత్యేకించింది.

వైద్య, పారిశ్రామిక రంగాలకు..

ఇచ్‌ వన్‌ టీచ్‌ వన్‌ నినాదమే స్ఫూర్తిగా బోధనా రుసుంల కోసం రూ.2,650 కోట్లు కేటాయింపులు చేసింది. పాఠశాల విద్యకు రూ.10,421 కోట్లు, ఉన్నత విద్యకు రూ.1,723.27 కోట్లు, సంపూర్ణ అక్షరాస్యత కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా వైద్య రంగానికి రూ.6,186 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. పారిశ్రామిక రంగ అభివృద్ధికి రూ.1,998 కోట్లు పద్దులో చూపింది. ఈ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.1,500 కోట్లు అందించనున్నట్లు తెలిపింది. విద్యుత్ రంగానికి రూ.10,416 కోట్లు ప్రతిపాదించింది.

రాష్ట్ర రవాణా..

ఆర్టీసీ అభివృద్ధికి రూ.1,000 కోట్లు, రహదారుల నిర్మాణం, నిర్వహణకు రూ.750 కోట్లు, రవాణా, రోడ్లు భవనాల శాఖకు రూ.3,494 కోట్లు కేటాయించగా.. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లను పద్దులో చూపింది. కల్యాణలక్ష్మి పథకానికి రూ.1,350 కోట్లు, మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ.1,200 కోట్లు కేటాయించింది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు రూ.11,917 కోట్లు ప్రత్యేకించింది.

ఇంకా ఇతర కేటాయింపులు..

పర్యావరణ, అటవీశాఖకు రూ.791 కోట్లు, దేవాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు, ధూపదీప నైవేద్యాలు, నిర్వహణకు రూ.50 కోట్లు కేటాయించింది. కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూ.550 కోట్లు పోలీస్‌శాఖకు రూ.5,852 కోట్లు ప్రతిపాదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ నిధుల కోసం రూ.480 కోట్లు కేటాయించింది.

ప్రతికూల పరిస్థితుల్లోనూ..

మాంద్యం కారణంగా ఆదాయం త‌గ్గుతోందన్నారు హరీశ్‌రావు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన వ్యూహాలను రూపొందించి.. అభివృద్ధి దిశగా పురోగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడం.. అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Last Updated : Mar 9, 2020, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.