అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలాని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో జనజాగరణ ద్వారా నిదుల సేకరణ కార్యక్రమాన్ని బోరబండలో ప్రారంభించారు. సంత్ సేవాలాల్ ఆలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్.. విరాళాల సేకరణను లాంఛనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా జనజాగరణ నిధి సేకరణ కార్యక్రమం కొనసాగనుంది.
'గతంలో భారతీయ సనాతన ధర్మం, సంస్కృతిని దెబ్బతీసేందుకు యత్నించారు. రాబోయే తరాలకు భారతీయ సంస్కృతిని తెలియజేసేందుకే రామమందిర నిర్మాణం చేపడుతున్నారు. రామరాజ్య స్థాపన జరగాలంటే రామమందిర నిర్మాణం జరగాల్సిందే. రామమందిర నిర్మాణం కోసం ప్రతి హిందువు సంకల్పం తీసుకోవాలి. జనజాగరణ నిధి సేకరణను విజయవంతం చేయాలి. సీఎం కేసీఆర్ కూడా సహకరించాలి.'
- బండి సంజయ్
ఇదీ చదవండి : కొనసాగుతున్న ఉత్కంఠ... మేయరా.. ప్రత్యేక కమిషనరా?