ETV Bharat / state

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రణాళికలు - రాష్ట్ర బీజేపీ పార్టీ వార్తలు

రాష్ట్రంలో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, పట్టభద్రుల స్థానాలతో పాటు దుబ్బాక ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలనాథలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే సంకేతాన్ని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. 2023 ఎన్నికల్లో గోల్కొండ ఖిల్లాపై కాషాయజెండా ఎగరాలంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రణాళికలు

author img

By

Published : Sep 4, 2020, 7:46 PM IST

తెలంగాణలో 2023లో జరిగే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేస్తోన్న కాషాయదళం.. 2021 ఫిబ్రవరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి 2023 ఎన్నికల్లో అధికార తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో జీహెచ్ఎంసీ, రెండు పట్టభద్రుల స్థానాలు, దుబ్బాక ఉప ఎన్నికలపైన ప్రధానంగా చర్చించారు.

గత ఎన్నికల్లో భాజపా కేవలం నాలుగు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయాల్లో ఇతర పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో భాజపాలో చేరడం వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. మరో వైపు కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి కోసం నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.

రాష్ట్రంలో భాజపా బలోపేతమైందని చెప్పడానికి లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని.. అదే విశ్వాసంతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. మార్చిలో జరిగే రెండు పట్టభద్రుల స్థానాల్లోనూ విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ రెండింటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ భాజపా సిట్టింగ్ స్థానం కాగా వరంగల్, నల్గొండ, ఖమ్మం సీటును కైవసం చేసుకునేలా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీ గా ప్రాతినిధ్యం వహిస్తున్న రాంచందర్ రావు మరోసారి అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

హైకోర్టు విభజన, న్యాయ మూర్తుల సంఖ్య పెంపు కోసం ఆయన చేసిన కృషి.. రాంచందర్ రావు విజయం సాధించేందుకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటుంటే... పార్టీలో కొందరు నేతలు మాత్రం రాంచందర్ రావుకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ జంగారెడ్డి మనవరాలు చందుపట్ల కీర్తిరెడ్డి కోరుతున్నారు.

నోటిఫికేషన్ వచ్చే సరికి ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార పార్టీ కంటే ముందే భాజపా అభ్యర్థి ప్రారంభించారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసిన భాజపా సీనియర్ నేత రఘునందన్ రావు.. ఉప ఎన్నికల్లోనూ సీటు తనకే కేటాయిస్తారనే విశ్వాసంతో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికలను సెమీ ఫైనల్​గా భావిస్తోన్న భాజపా మిగిలిన 12 జిల్లాలకు అధ్యక్షులు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్, వివిధ మోర్చాల పూర్తి స్థాయి కమీటీలను నియమించి సత్తాచాటేందుకు సన్నద్ధమవుతోంది.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.