ETV Bharat / state

నేడు విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం - అసెంబ్లీ వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం - Bhatti Vikramarka vs Harish Rao in Assembly

Telangana Assembly Sessions Live News Today 2023 : రాష్ట్ర ప్రభుత్వం నేడు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని సభ ముందు ఉంచనున్నారు. అప్పులు, నష్టాలతో పాటు అన్ని అంశాలను తెలంగాణ సర్కార్‌ ఇందులో పొందపర్చినట్లు సమాచారం.

Power Sector
Power Sector
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 7:51 AM IST

Telangana Assembly Sessions Live News Today 2023 : విద్యుత్‌రంగంపై (Power Sector) రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఆయా రంగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్, బుధవారం నాడు శాసనసభ వేదికగా ఆర్థికరంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి సమావేశాల్లో విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. దీన్ని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభ ముందు ఉంచనున్నారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ రంగంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

Telangana Assembly Sessions 2023 : గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా, రాష్ట్ర విద్యుత్ సంస్థలు 81,516 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయని, మరో రూ.50,275 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర సర్కార్ తెలిపింది. అప్పులు, నష్టాలతో పాటు కరెంట్ సరఫరా, కొనుగోళ్లు, ఉత్పత్తి, ఉత్పత్తి కేంద్రాలు సహా అన్ని అంశాలను శ్వేతపత్రంలో పొందుపరచనున్నారు. అనంతరం తెలంగాణలో విద్యుత్‌రంగం స్థితిగతులు - శ్వేతపత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

హరీశ్‌రావు వర్సెస్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మోటార్లకు మీటర్ల విషయంలో మాటల యుద్ధం

White Paper on Economic Status of Telangana : రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బుధవారం నాడు శాసనసభా వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ సర్కార్ హయాంలో ఆర్థిక విధ్వంసం, వనరులు ఎలా దుర్వినియోగం అయ్యాయో వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేయాలని కాకుండా, రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దేందుకేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన పెద్ద సవాల్ ఉందని చెప్పారు. కొందరికి చేదుగా ఉన్నప్పటికీ అందరూ జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందని భట్టి వివరించారు.

శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ : హరీశ్‌రావు

గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దురుద్దేశం : చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్‌ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దురుద్దేశంతో వాస్తవాలను దాచి నివేదిక రూపొందించారని ఆక్షేపించారు. అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నామని, కానీ లెక్కల్లో అలా చూపించలేదన్నారు. పెరిగిన ఆదాయం, ఆస్తుల ప్రస్తావనే లేకుండా పోయిందని అన్నారు. అప్పులను మాత్రం ఎక్కువగా చూపే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బలంగా ఉందని నిపుణులు చెప్తుంటే దివాళా తీసినట్లు రాష్ట్ర సర్కార్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాడివేడి చర్చతో శాసనసభ ఇవాళ్టికి వాయిదా పడింది.

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్‌ రెడ్డి

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.