ETV Bharat / state

బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ

2020- 21 బడ్జెట్​పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తైన నేపథ్యంలో శాసనసభలో నేటి నుంచి పద్దులపై చర్చ ప్రారంభంకానుంది.

Telangana Assembly sessions
బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ
author img

By

Published : Mar 13, 2020, 6:12 AM IST

బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ

బడ్జెట్ పద్దులపై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2020- 21 బడ్జెట్​పై సాధారణ చర్చ, ప్రభుత్వ సమాధానం పూర్తైన నేపథ్యంలో శాసనసభలో నేటి నుంచి పద్దులపై చర్చిస్తారు. ఈరోజు సంక్షేమ పద్దులపై చర్చ ఉంటుంది. గృహనిర్మాణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా- శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది.

పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో జిల్లా సమీకృత కార్యాలయాలు, విదేశీవిద్య కోసం ఉపకారవేతనాలు, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ- పర్యాటక కేంద్రంగా నల్లమల, లాభదాయక సంస్థగా ఆర్టీసీ తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. శాసనమండలిలో బడ్జెట్​పై జరిగిన సాధారణ చర్చకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇస్తారు. పల్లెప్రగతిపై మండలిలోనూ స్వల్పకాలిక చర్చ ఉంది.

ఇవీ చూడండి: 'పారాసెటమాల్​తోనే కరోనాకు చికిత్స!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.