ETV Bharat / state

Telangana Congress Candidates List : అసెంబ్లీ ఎన్నికల బరిలోకి.. 'కాంగ్రెస్ గెలుపు గుర్రాలు' - Congress Candidates List

Congress Candidates for Telangana Assembly Elections : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో 50 నుంచి 60 నియోజక వర్గాలల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు.. తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సర్వేలు పూర్తి చేసిన పీసీసీ... వివాదస్పదం లేని నియోజకవర్గాలల్లో అభ్యర్థులు ఎవరో తేల్చేయాలని భావిస్తోంది. అభ్యర్ధులకు చెందిన సమాచారం బయటకు పొక్కకుండా... పీసీసీ జాగ్రత్త పడుతోంది. సీనియర్లు, జూనియర్లు అన్నది ఇక్కడ ప్రామాణికం కాదని చెబుతున్న పార్టీ వర్గాలు... గెలుపు గుర్రాలే ప్రధానమని స్పష్టం చేస్తున్నాయి.

Congress survey for announce the candidates early
గెలిచే అవకాశం ఉంటేనే టికెట్.. గెలుపు గుర్రాలే బరిలోకి
author img

By

Published : Jun 5, 2023, 9:46 AM IST

గెలిచే అవకాశం ఉంటేనే టికెట్.. గెలుపు గుర్రాలే బరిలోకి

Congress survey on candidates for Telangana Assembly Elections : రాష్ట్రంలో మారిన రాజకీయ ముఖచిత్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను దీటుగా ఎదర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారిన పరిస్థితులను పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి... పీసీసీ, ఏఐసీసీ స్థాయిల్లో తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిల్లో సర్వేలు నిర్వహించి.. ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారు. అదేవిధంగా పరిచయాలు ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేసేందుకు... టికెట్‌ దక్కదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌ రావ్‌ ఠాక్రే కూడా ఇటీవల తేల్చి చెప్పారు.

Telangana Assembly Elections 2023 : ఠాక్రే ప్రకటనతో హైదరాబాద్‌ను అంటిపెట్టుకుని ఉండే నాయకులు సైతం... నియోజకవర్గాలల్లో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్నారు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా.. .నియోజక వర్గ స్థాయిలో సమగ్ర సర్వేలు నిర్వహిస్తున్నారు. సునీల్‌ కనుగోలు బృందంతోపాటు.. రేవంత్‌ రెడ్డి కూడా ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వివిధ స్థాయిల్లో కసరత్తు చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. దాదాపు సగం సీట్లకు చెందిన, వివాదరహితమైన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ప్రకటించినా.. 50 నుంచి 60 స్థానాలకు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎంపికైన కీలకమైన అభ్యర్థులు : ఎలాంటి వివాదం లేని అసెంబ్లీ నియోజక వర్గాలల్లో అభ్యర్థుల ప్రకటనకు పార్టీ సిద్ధమవుతోంది. అందులో ఉమ్మడి జిల్లాల వారీగా వరంగల్‌ జిల్లాలో నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి నాయిని రాజేందర్‌ రెడ్డి, వరంగల్‌ తూర్పు నుంచి కొండా సురేఖ... పాలకుర్తి నుంచి జంగారాఘవ రెడ్డి, ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్క, భూపాల్‌ పల్లి నుంచి గండ్ర సత్యనారాయణలు బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని నుంచి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్- ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ప్రవీణ్‌ రెడ్డి.. హుజురాబాద్ నుంచి ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​లు బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు.

Telangana Congress Candidates List : ఇక చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు నుంచి కౌవ్వంపల్లి సత్యనారాయణ... పెద్దపల్లి నుంచి విజయ రమణా రావు, ధర్మపురి నుంచి గతంలో పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్‌, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్ రావులు పోటీ చేయనున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వైరా నుంచి రాందాస్ నాయక్... అశ్వారావు పేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి పొదెం వీరయ్య... ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నల్లగొండ నుంచి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.. కోదాడ నుంచి పద్మావతి, సూర్యాపేట నుంచి ఆర్. దామోదర్ రెడ్డి... ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుటుంబం నుంచి రఘువీర్ రెడ్డి... మిర్యాలగూడ నుంచి బి లక్ష్మారెడ్డి, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి.. కల్వకుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్‌ రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీ కృష్ణ, షాద్‌నగర్ నుంచి ఈర్లపల్లి శంకర్‌.. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, అలంపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మక్తల్‌ నుంచి ముదిరాజ్‌ శ్రీహరిని పోటీకి దింపేందు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నుంచి గండ్రోత్‌ సుజాత, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, బోద్‌ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేష్‌ జాదవ్‌... బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్‌కుమార్‌. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జుక్కల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం, నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి మహేశ్‌కుమార్‌ గౌడ్‌... నిజామాబాద్‌ రూరల్‌ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, కామారెడ్డి నుంచి షబీర్‌ అలీ, బోదన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిలు ఉన్నారు.

మెదక్ నుంచి తిరుపతి రెడ్డి, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి... ఆందోల్‌ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ, జహీరాబాద్ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి నందికంటి శ్రీధర్... వికారాబాద్ నుంచి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి.. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి... సికింద్రాబాద్ నుంచి ఆదం సంతోష్, గోషామహల్‌ నుంచి కాంగ్రెస్‌ ఫిసరీస్‌ ఛైర్మన్‌ మెట్టు సాయి కుమార్, మలక్ పేట్ నుంచి చెట్లోకర్‌ శ్రీనివాస్‌లు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సర్వేల ఆధారంగా ఎంపిక : కాంగ్రెస్‌ పార్టీకి పలు చోట్ల ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో.. అక్కడ సర్దుబాటు చేసే కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. అయితే సర్వేల ఆధారంగా వారితో చర్చించి గెలుపు గుర్రాలను ఎంపిక చేసే దిశలో.. ముందుకు వెళ్తోంది. మరోవైపు పలు నియోజకవర్గాలల్లో అభ్యర్థులు లేరు. హైదరాబాద్‌ తీసుకుంటే సనత్‌నగర్‌లో మర్రి శశిధర్‌ రెడ్డి భాజపాలోకి వెళ్లిన తర్వాత అక్కడ మరొక నాయకుడు కనిపించడం లేదు. అదేవిధంగా కంటోన్మెంట్‌, నల్గొండ జిల్లా నకిరేకల్‌, అదిలాబాద్‌ జిల్లా ముదోల్‌, నిర్మల్‌, అసిఫాబాద్‌.. నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ, ఆర్మూర్‌, ఖమ్మం జిల్లా పినపాక, ఇల్లందు తదితర దాదాపు 15 నియోజకవర్గాల్లో... సరియైన అభ్యర్థులు లేరు. అదే విధంగా ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని అంచనా వేస్తున్న పీసీసీ... కొన్ని నియోజకవర్గాలల్లో బయట నుంచి వచ్చే వారికి సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.