TET Teachers Promotion in Telangana 2024 : తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతి పొందాలంటే, టెట్ ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. ఈ మేరకు సర్కార్ తుది నిర్ణయానికి వచ్చింది. విద్యాహక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం, ఉపాధ్యాయులుగా నియమితులైన వారు పదోన్నతి పొందాలంటే టెట్‌లో పాస్‌కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సైతం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) వివరించారు.
TET Is Must For Teacher Promotion Telangana : ఈక్రమంలో టెట్ నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే ఆ పరిణామం వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. కొత్త నియామకాల్లో ఆ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ, పదోన్నతులకు మాత్రం అమలు చేయట్లేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వారికే పదోన్నతులివ్వాలని, పలువురు ఉపాధ్యాయులు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు.
పదోన్నతి కోసం టెట్ పాసైన వారి సీనియారిటీ జాబితా సమర్పించాలని, గత సెప్టెంబరు 27న హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడంతో ప్రమోషన్లకు బ్రేక్ (Teacher Promotions in Telangana)పడింది. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్‌ఎంలుగా పలువురికి దక్కాల్సిన ప్రమోషన్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్ రెడ్డి
టెట్ ఉత్తీర్ణులైన టీచర్లు 26 వేల మందే : తెలంగాణలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 ఉంటే, ప్రస్తుతం 1,03,343 మంది పనిచేస్తున్నారు. అంటే 19,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రవేశపెట్టిన తర్వాత 2012, 2017లలో మాత్రమే టీచర్ల నియామకాలు జరిగాయి. అంటే టెట్ పాసై (Telangana TET) ఉపాధ్యాయులుగా చేరిన వారు రాష్ట్రంలో 15,000 మందికి మించరు. దానికితోడు మరో 11,000ల మంది 1996, 1998, 2001, 2002, 2003 డీఎస్సీల్లో నియమితులైన వారు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు పదోన్నతులకు అవసరమని టెట్ రాసి ఉత్తీర్ణులయ్యారు.
చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు- NCERT కీలక సిఫార్సులు!
మొత్తానికి సుమారు 26,000ల మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన టీచర్లు ఉన్నారు. అంటే ఇంకా 96,000 మందికి టెట్ అర్హత లేదు. వాస్తవానికి పదోన్నతికి కూడా టెట్ తప్పనిసరి కావడంతో, 2015లోపు ఉత్తీర్ణులు కావాలని కేంద్రం గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు (2019 వరకు) గడువు పెంచుతూ పార్లమెంట్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా, విద్యాశాఖ దాన్ని అమలు చేయలేదని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఫోరం కోశాధికారి పి.రేవంత్‌కుమార్ తెలిపారు.
ప్రత్యేక టెట్ నిర్వహించాలి : పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని ఎన్‌సీటీఈ నిబంధనలు చెబుతున్నాయని టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు. తాము స్వయంగా వెళ్లి అడిగినా అదే సమాధానం వచ్చిందని చెప్పారు. ప్రస్తుత టీచర్లకు అందరితోపాటు కాకుండా ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని చావా రవి కోరారు.
మసకబారుతున్న ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిష్ఠ - డిప్యుటేషన్లు, ఫారిన్ సర్వీస్‌ల పేరిట ఏళ్ల తరబడి తిష్ఠ
త్వరలోనే మెగా డీఎస్సీ - 9,800 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్లాన్!