ETV Bharat / state

'ఎన్టీఆర్​ సంక్షేమ పథకాలే... నేటి పార్టీలకు వరప్రదాయిని' - ఎన్టీఆర్​ వర్ధంతి

రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి పురస్కరించుకుని హైదరాబాద్‌ బేగంపేట రసూల్‌ పూరాలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు.

tdp leaders pay tribute to senior ntr
'ఎన్టీఆర్​ సంక్షేమ పథకాలే... నేటి పార్టీలకు వరప్రదాయిని'
author img

By

Published : Jan 18, 2020, 11:54 AM IST

నాడు తెదేపాకు ఎన్టీఆర్‌ అభిమానులే కార్యకర్తలుగా పనిచేసి పార్టీని అందలం ఎక్కించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ అన్నారు. హైదరాబాద్​ రసూల్​పురాలోని ఎన్టీఆర్​ విగ్రహం వద్ద నందమూరి రామకృష్ణ, సుహాసిని, పార్టీ పొలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్‌ అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి గిన్నిస్‌ రికార్డులో చేరారని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్​ గుర్తు చేశారు. తారకరామారావు ఆశయాన్ని తామంతా ముందుకు సాగిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్‌ రూపొందించి అమలు చేసిన సంక్షేమ పథకాలే నేటి రాజకీయ పార్టీలకు వరప్రదాయిని అని నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని అన్నారు. ఆ మహానుభావుడి అడుగు జాడల్లో ముందుకు సాగుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.