లాక్డౌన్లోనూ రోడ్డు పన్ను కట్టాలని తమను ఆర్టీఏ అధికారులు వేధిస్తున్నారంటూ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు హెచ్చార్సీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాయి. ట్రావెల్స్ వాహనాలకు కొన్ని రోజుల వరకు పన్ను చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేలా రవాణా శాఖను ఆదేశించాలని కోరాయి.
ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు పన్ను బకాయిల పేరుతో వాహనదారులను ఆర్టీఏ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి : పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు