ETV Bharat / state

విజయం కోసం భాజపా ఎన్ని కుట్రలైనా చేస్తుంది: తలసాని శ్రీనివాస్

Munugode bypoll: మునుగోడు ఎన్నికలు తారస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఒకరిపై ఒకరు మాటలు విసురుకుని హడావిడిగా ఉంటున్నారు. ఎన్నో రోడ్డుషోలు, ప్రెస్​మీట్​లు పెడుతూ నేతలు అందరూ బిజీగా ఉన్నారు. తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సైతం ప్రెస్​మీట్​ పెట్టి ప్రత్యర్థులపై విమర్శన అస్త్రాలను వదిలారు.

Minister Talasani Srinivas Yadav fire on BJP
మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​
author img

By

Published : Oct 25, 2022, 4:51 PM IST

Talasani comments on BJP: విజయం కోసం భాజపా ఎన్ని కుట్రలైనా చేస్తుందని ప్రజలు వాటిని నమ్మ వద్దని మునుగోడు ప్రజలకు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని హితవు పలికారు. భాజపా నాయకులు దాడి, గాయాలంటూ నాటకాలు ఆడుతున్నారన్నారని ఆరోపించారు. మళ్లీ ఆ నెపాన్ని తెరాస పార్టీ మీద నెట్టేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికలో ఓటమి పాలవుతామనే భయంతో ఇటువంటి కుయుక్తులకు పూనుకుంటున్నారన్నారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నిన తెరాస గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాజగోపాల్​రెడ్డి ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. ఇది అతని స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపఎన్నికను తీసుకువచ్చారన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఇంతకు ముందు ఎమ్మెల్యేనే.. మళ్లీ గెలిస్తే మాత్రం ఏమవుతారు ఎమ్మెల్యేనే కదా అని నవ్వుకున్నారు. కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, భాజపాలోకి పారిపోయారని దుయ్యబట్టారు.

ఫ్లోరైడ్​ సమస్య నిర్మూలన.. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కరిస్తామని కేసీఆర్‌ ఉద్యమ సమయంలోనే చెప్పారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్​ సమస్యను మిషన్​ భగీరథ ప్రాజెక్ట్​తో అంతం చేశారని తెలిపారు. నల్గొండ జిల్లాలో పెండింగ్​లో ఉన్న అన్ని సమస్యలను వచ్చే ఏడాది కాలంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.