సికింద్రాబాద్ సనత్‌నగర్‌లోని హమాలీ బస్తీలో నిరుపేదలకు సువర్ణభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెరాస నాయకుడు తలసాని సాయి కిరణ్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని దరిచేరకుండా చూసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వలస కూలీలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలత, తదితర నాయకులు పాల్గొన్నారు.