T Congress Party Public Meeting on October 31st at Kollapur : ఈనెల 31వ తేదీన కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభ(Telangana Congress Public Meeting)ను నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారంలో రాహుల్‌గాంధీ పర్యటన(Rahul Gandhi Tour in Telangana) ఉంటుందని ఆయన వెల్లడించారు. రాహుల్‌గాంధీ రెండో విడత బస్సు యాత్రలో పాల్గొంటారని వివరించారు.
ఈనెల 26,27 తేదీలలో ఆరు గ్యారంటీలపై మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పర్యటిస్తారని తెలిపారు. ఈ రెండు తేదీల్లో రోజుకు రెండు నియోజకవర్గాలు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి.. గ్యారెంటీలను వివరిస్తారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్ వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు పవనాలు వీస్తున్నాయని.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు.. ప్రజల మద్దతు ఏ విధంగా ఉందో చూశారని అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి చెప్పినట్లు.. డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం
Telangana Congress 2nd Phase Bus Yatra : కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర(Congress Bus Yatra 2023) కూడా ఈనెల 28 నుంచి 30 వరకు జరిగే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్పష్టత బుధవారం, గురువారాల్లో వస్తుంది. దాదాపు 7 లేదా 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఇక బీఆర్ఎస్ పాలన చాలు అంటూ.. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని అంటున్నారని మహేశ్‌గౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర షెడ్యూల్ వివరాలు : అక్టోబరు 18న రామప్ప ఆలయం నుంచి మొదటి విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ బస్సు యాత్ర మూడు రోజుల పాటు సాగింది. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో పాల్గొని.. ప్రసంగించారు. ఇప్పుడు రెండో విడత బస్సు యాత్ర ఈనెల 28 నుంచి 30 జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాచారం. అనంతరం నామినేషన్లు పూర్తి అయిన తర్వాత మూడో దశ బస్సు యాత్ర జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు.