ETV Bharat / state

జనవరి 1 నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే

స్వచ్ఛత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ర్యాంకింగ్​లు ప్రకటించడానికి కేంద్ర స్వచ్ఛభారత్​ మిషన్​ ప్రాధాన్యతనిచ్చింది. దీనిలో భాగంగా 2021 స్వచ్ఛ సర్వేక్షణ్​ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా విభజించి ర్యాంకింగ్​లను జారీచేయనున్నారు.

swachh survekshan 2021
జనవరి 1 నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే
author img

By

Published : Dec 31, 2020, 12:08 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్ క్లీన్లీనెస్​ సర్వే-2021గా పేర్కోనే ఈ సర్వే ద్వారా స్వచ్ఛతపై నగరాలకు మార్కులు కేటాయించనున్నారు. 2021 జనవరి 1 తేదీ నుంచి మార్చి 28 వరకు నిర్వహించే... ఈ సర్వేలో గ్రేటర్​ హైదరాబాద్​ వాసుల ప్రశ్నలకు సానుకూల సమాధానాలు ఇవ్వడం ద్వారా హైదరాబాద్​ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపాలని జీహెచ్​ఎంసీ విజ్ఞప్తి చేసింది.

ముఖ్యంగా గతంలో మాదిరిగానే స్వచ్ఛ కార్యక్రమాలు, తడి, పొడి చెత్త వేర్వేరు, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్​కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా... తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్​ నిషేధం, పొడి, తడి చెత్త విడదీయడం లాంటి ప్రశ్నలు ప్రస్తుత 2021 స్వచ్ఛ సర్వేక్షణ్​లో పొందుపర్చారని జీహెచ్​ఎంసీ వివరించింది.

ఈ ప్రశ్నలకు 1800 మార్కులు కేటాయించారని... మొత్తం 6వేల మార్కులకు గానూ సర్వీస్ లెవల్ ప్రొగ్రెస్​కు 2400 మార్కులు, సర్టిఫికేషన్​కు 1800 మార్కులు కేటాయించారు. ఈ సర్వే ద్వారా వచ్చిన మార్కుల‌ను దేశంలోని ఇత‌ర మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లు, మెట్రో సిటీల‌కు వ‌చ్చిన మార్కులతో పోల్చి అధికంగా వ‌చ్చిన మార్కుల ప్రాతిప‌దికంగా స్వచ్ఛ స‌ర్వేక్షణ్-2021 ర్యాంకింగ్‌ల‌ను ప్రక‌టిస్తారు. ముఖ్యంగా మున్సిప‌ల్ సంస్థలు, స్వచ్ఛ స‌ర్వేక్షణ్‌లో చేప‌ట్టిన అంశాలపై స‌మ‌ర్పించే నివేదిక‌ల ఆధారంగా న‌గ‌ర‌వాసుల‌ను 5 ప్రశ్నల‌తో ఫోన్ల ద్వారా సంప్రదిస్తారని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.