దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లను రిసార్ట్‌లుగా మార్చామని రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ శాఖ కమిషనర్ వి.కె.సింగ్ అన్నారు. నాంపల్లి, బేగంబజార్‌లో గార్బేజ్ ఫ్రీ హైదరాబాద్.. పరిశుభ్రత పై జన్ సేవా సంఘ్ నిర్వహించిన అవగాహన ర్యాలీలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భాగ్యనగర వాసులు స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ సాధించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్ఛత కోసం ప్రజలంతా ఏకమై పరిశుభ్రత కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ఏడాదిలో భాగ్యనగరాన్ని బెగ్గర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ హైదరాబాద్‌లా చేయాలనేది తన ఆకాంక్ష అని వీకే సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూండండి: స్వచ్ఛదర్పన్ ఫేస్-3 ర్యాంకుల్లో తెలంగాణ హవా