ETV Bharat / state

'నదులను బతికించటమే నేటి నాగరికత' - rivers

ఈషా ఫౌండేషన్ ఇచ్చిన 'కావేరి పిలుపు' మేరకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ మద్దతు ప్రకటించారు. నదుల పరిరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

నదులను బతికించటం నేటి నాగరికత
author img

By

Published : Sep 6, 2019, 12:35 PM IST

నదుల వల్ల బతకటం అప్పటి నాగరికత... నదులను బతికించటం ఇప్పటి నాగరికత... అని అన్నారు సినీగేయ రచయిత అనంత శ్రీరామ్. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ఇచ్చిన కావేరి పిలుపునకు మద్దతుగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్​లోని పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి సమస్యల తలెత్తకుండా సద్గురు ఇచ్చిన ఈ పిలుపునకు తెలుగు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కావేరి నది పరివాహక ప్రాంతంలో 242 కోట్ల మెుక్కలను ఈషా ఫౌండేషన్ నాటునున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన కూడళ్లలో 3500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

నదులను బతికించటమే నేటి నాగరికత

ఇదీచూడండి: నాసాకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థిని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.