ETV Bharat / state

బీసీల కులాల వారీ లెక్కింపుపై సుప్రీంలో విచారణ

బీసీలను కులాల వారీగా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్​కు చెందిన మల్లేశ్ ​యాదవ్, ఆళ్ల రామకృష్ణ పిటిషన్​ వేయగా... సర్వోన్నత ధర్మాసనం విచారణ చేపట్టింది.

బీసీల కులాల వారీ లెక్కింపుపై సుప్రీంలో విచారణ
బీసీల కులాల వారీ లెక్కింపుపై సుప్రీంలో విచారణ
author img

By

Published : Feb 26, 2021, 3:13 PM IST

జనాభా గణన 2021లో బీసీలను కులాల వారీగా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్​కు చెందిన మల్లేశ్ ​యాదవ్, ఆళ్ల రామకృష్ణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా... సీజేఐ జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జీఎస్ మణి.. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన పిటిషన్​లో కోర్టు నోటీసులు జారీ చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసులో కూడా ప్రతివాదులైన కేంద్ర హోంశాఖ, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖతో పాటు బీసీ జాతీయ కమిషన్​కు నోటీసులు జారీ చేస్తున్నట్లు సీజేఐ తెలిపారు. తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. గతేడాది నవంబర్​లోనే జనాభా గణన 2021లో బీసీలను కులాల వారీగా లెక్కించాలని బీసీ నేత ఆర్.కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

ఇదీ చూడండి: కోడిపై మర్డర్​ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.