Supreme Court: తెలంగాణలో 19 లక్షలకు పైగా రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌పై ఇవాళ విచారణ జరిగింది. సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. పరిశీలన చేయకుండా రేషన్ కార్డులను ఎలా రద్దు చేస్తారన్న ధర్మాసనం.. 2016 మార్గదర్శకాలతో మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించింది. అలాగే కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: