Amaravati Capital Petitions: అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. బెంచ్ కార్యకలాపాలు ముగియనుండటంతో విచారణ చేపట్టాలని రైతుల తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పిటిషన్ గురువారం రాత్రి 11.30 గంటలకు వచ్చిందని తెలిపిన ధర్మాసనం.. కేసు వివరాలు తెలుసుకోకుండా విచారణ చేపట్టలేమంది.
పిటిషన్లు పరిశీలించి తదుపరి వాదనలు వింటామని వెల్లడించింది. తాము పరిశీలించేవరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోరగా.. అంతగా అత్యవసరం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను సోమవారానికి వాయిదా వేస్తామని కోర్టు తెలపగా.. రైతుల తరఫు న్యాయవాది వారం రోజులు సమయం ఇవ్వాలని కోరారు.
వారం సమయమిస్తే కేసు పూర్వాపరాలతో అఫిడవిట్ సమర్పిస్తామన్న వెల్లడించారు. ఈనెల 7న విచారణకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించగా.. ఇరుపక్షాల వాధనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. విభజన కేసులతో జత చేశారని, విడివిడిగా విచారించాలన్న ప్రభుత్వ న్యాయవాది కోరగా .. అన్ని విజ్ఞప్తులపై విచారణ సమయంలోనే నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు తెలిపింది.
ఇవీ చదవండి: