ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామంలోని శైవక్షేత్రంలో శివ లింగాన్ని... సాయం సంధ్యవేళలో సూర్యుడి కిరణాలు తాకాయి. ప్రత్యేకించి శివరాత్రి రోజున శివలింగంపై సూర్యకిరణాలు పడటం వల్ల స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. అయ్యగార్లపల్లి గ్రామం కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల.... కర్ణాటక నుంచి స్వామివారిని దర్శించుకోవటానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.