ప్రతి ఆదివారం హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న "సన్ డే పన్‌డే" కార్యక్రమం (Sunday funday at tank bund) భాగ్యనగరవాసులకు సరికొత్త అనుభూతులను అందిస్తుంది. ఆదివారం వచ్చిందంటే చాలు నగరవాసులు ట్యాంక్‌బండ్ వైపు చూసేలా కార్యక్రమాలు నిర్వహించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నగరవాసులే కాకుండ ఇతర జిల్లా, రాష్ట్రాల నుంచి సైతం ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఒకవైపు ట్యాంక్‌బండ్ అందాలు...మరోవైపు షాపింగ్ అనుభూతి వీటితో పాటు చిన్నారులకు కావాల్సిన పన్‌గేమ్ ఇలా చిన్నా, పెద్ద అందరూ కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు.
పల్లె జాతరకు వెళ్లిన అనుభూతి కలుగుతుంది
ఇన్నాళ్లు చూసిన ట్యాంక్‌బండ్ కంటే ఇప్పుడు చూస్తున్న ట్యాంక్‌బండ్ (Sunday funday at tank bund) చాలా బాగుందని నగరవాసులు అంటున్నారు. ఆదివారం ఇక్కడికి వస్తే సొంత ఊరుల్లో ఉన్నామనే భావన కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పల్లె జాతరకు వెళ్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడికొస్తే అలాంటి మధురాన కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భద్రతా ఏర్పాట్లు బాగున్నాయి
సన్‌డే పన్‌డే కార్యక్రమం (Sunday funday at tank bund) ఏర్పట్లతో పాటు భద్రత పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నగరవాసులకు మరింత ఉత్సహం అందిస్తుందని పేర్కొంటున్నారు.
పగడ్బందీగా ఏర్పాట్లు
ప్రతివారం సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సంచార శౌచాలయాలు, తాగునీటి వసతితో ఇతర వసతులను హెచ్‌ఎండీఏ కల్పిస్తుంది. సందర్శకులకు ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. వారాంతపు విహారానికి వచ్చే కుటుంబాలు, సందర్శకుల కోసం తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యాక్రమాలు (awareness programs) చేపట్టింది.
ఇదీ చూడండి: EK SHAM CHARMINAR KE NAAM: సందడికి వేళైంది.. 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' మొదలైంది.!