హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమ పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లలో దక్షిణమండలం డీసీపీ గజరావు భూపాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రవర్తనలో మార్పు, నేరాలకు దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వారిని అదుపులో ఉంచడానికే ఈ తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ధరణి, రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ సమీక్ష