ETV Bharat / state

కరోనా చికిత్సతో కుటుంబాలు అప్పులపాలు - కరోనా వార్తలు

కొవిడ్‌ ఆరోగ్యపరంగానే కాదు.. మనుషుల్ని ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. కరోనాతో బతుకులు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. వైరస్​ బారినపడిన కుటుంబాల్లో కొందరు చికిత్స కోసం రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి చితికిపోతున్నారు. మనిషిని బతికించుకోవాలనే ఆశతో ఇల్లో, పొలమో అమ్మేసో.. తాకట్టు పెట్టో కార్పొరేట్‌ ఆసుపత్రులు అడిగినంతా చెల్లిస్తున్నారు. లక్షలు కుమ్మరించినా.. చివరకు అయినవారు దక్కక మానసికంగా కుమిలిపోతున్నారు.

Struggling financially with Corona in telangana
కరోనా చికిత్సతో కుటుంబాలు అప్పులపాలు
author img

By

Published : Sep 22, 2020, 7:13 AM IST

ప్రస్తుతం కొన్ని వందల కుటుంబాల్లో కరోనా ఆర్థిక చిచ్చు రేపుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకంతో చేరుతున్న బాధితులు.. అక్కడ బిల్లులు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సల ధరలను ప్రభుత్వం స్థిరీకరించినా.. సరిగా అమలు కాకపోవడంతో బాధితులు గత్యంతరం లేక చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించినా.. సాక్షాత్తు హైకోర్టు మందలించినా.. కొన్ని ఆసుపత్రుల తీరు మారడంలేదు.

కార్పొరేట్‌లో తగ్గని డిమాండ్‌

కరోనా చికిత్సల కోసం ప్రభుత్వం 45 జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 8,093 పడకలను సిద్ధం చేసింది. వాటిలో 2,584 (31.92 శాతం) పడకలు మాత్రమే నిండాయి. రాష్ట్రంలో 223 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు 11,055 పడకలను అందుబాటులో ఉంచగా.. వాటిలో 4,062 (36.74 శాతం) పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్యలో పెద్దగా వ్యత్యాసమేమీ లేదు. హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం దాదాపు 70-80 శాతం వరకూ పడకలు నిండిపోయి ఉండడం గమనార్హం. వైద్యఆరోగ్యశాఖ ఆదివారం నాటి గణాంకాల ప్రకారం బంజారాహిల్స్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో 167 కొవిడ్‌ పడకలు ఉంటే.. 154 నిండిపోయాయి. హైటెక్‌ సిటీలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో 205 పడకల్లో 186 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మరో కార్పొరేట్‌ ఆసుపత్రిలో 100 ఐసీయూ పడకలుంటే అన్నింటిలోనూ రోగులు చికిత్స పొందుతుండడం గమనార్హం.

అమల్లోలేని సర్కారు ధరలు

ఏ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స అందించినా.. రోజుకు ఐసోలేషన్‌లో రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ చికిత్సకు రూ.9,000 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులు ఇప్పటికీ చాలా ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. ఏవైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలంటూ ప్రభుత్వం ‘91541 70960’ వాట్సప్‌ నంబరు ప్రకటించగా, వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స వ్యయాన్ని తగ్గించకపోగా.. మరింత ఎక్కువగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం గత నెలలో రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంది. కార్పొరేట్‌ దోపిడీపై ఇటీవల శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రుల్లో చికిత్స వ్యయాల పర్యవేక్షణకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. అయినా చాలాచోట్ల చికిత్సల ఖరీదులో మార్పు కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కరోనాను చేర్చడంతో పాటు చికిత్సల ఖరీదును కూడా పక్కాగా అమలు జరిగేట్లు చూడాలని వారు కోరుతున్నారు.

ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలెన్నో..

  • ఖమ్మంలోని ఓ వ్యాపారి కుటుంబంలో 12 మంది కొవిడ్‌ బారినపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కొందరు మూడు నాలుగు రోజులకే ఇంటికి చేరగా.. మరికొందరు 10 రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. మొత్తం రూ.30 లక్షల వరకూ ఖర్చయింది. అంత చేసినా ఇంటి పెద్ద ప్రాణాలు మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
  • మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక మహిళ కాన్పు కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరింది. ముందుగా కొవిడ్‌ పరీక్ష చేయించగా నెగెటివ్‌గానే తేలింది. సిజేరియన్‌కు రూ.2 లక్షలు చెల్లించారు. అక్కడ ఉండగానే ఆయాసం రావడంతో.. ఐసీయూకు తరలించారు. 20 రోజుల చికిత్సలో రూ. 29 లక్షలు కట్టాల్సి వచ్చింది. చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పు చేసి రూ.లక్షలు ధారపోసినా.. ప్రాణం దక్కలేదని ఆమె భర్త ఆవేదన వెలిబుచ్చాడు.
  • వరంగల్‌కు చెందిన ఒక ఫొటో జర్నలిస్టుకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వచ్చింది. బిల్లు ఏకంగా రూ.28 లక్షలైంది. దీంతో వారి కుటుంబం అప్పులపాలైంది.
  • ఆదిలాబాద్‌ పట్టణంలో ఒక ఉమ్మడి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. 8 మంది కుటుంబ సభ్యుల్లో ఏడుగురు కొవిడ్‌ బారినపడ్డారు. అన్నదమ్ములిద్దరి ఆరోగ్యం విషమించడంతో ఒకరిని నాగ్‌పుర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో, మరొకరిని ఆదిలాబాద్‌లోని ప్రైవేటులో చేర్పించారు. 10 రోజుల వ్యవధిలో ఇద్దరూ కన్నుమూశారు. వైద్యం కోసం రూ.6 లక్షలకు పైగా అప్పు చేయాల్సి వచ్చింది. సంపాదించే వ్యక్తులిద్దరినీ కోల్పోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలీక ఆ కుటుంబం సతమతమవుతోంది.
Struggling financially with Corona in telangana
బస్వంత్‌
  • నిజామాబాద్‌ జిల్లా బీర్కూర్‌ మండలం బరంగెడ్గి గ్రామానికి చెందిన బస్వంత్‌(46) అనే ఆర్‌ఎంపీ వైద్యుడికి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆరురోజుల కొవిడ్‌ చికిత్సకు రూ. 12 లక్షల బిల్లు వేశారు. అయినా ఆయన మృతిచెందారు. పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు అప్పుల పాలైంది. ఇద్దరు పిల్లల పెంపకంతో పాటు వడ్డీ, అసలు చెల్లించాల్సిన భారం ఆ ఇల్లాలిపై పడింది.
Struggling financially with Corona in telangana
కరోనా చికిత్సతో కుటుంబాలు అప్పులపాలు
  • ఆదిలాబాద్‌ జిల్లాలోని పెందూర్‌ లక్ష్మణ్‌రావు(56) ఆదివాసీ నాయకుడు. తలమడుగు మండలం ఉమ్రి గ్రామానికి చెందిన ఆయనది మూడు దశాబ్దాల రాజకీయ జీవితం. ఉమ్రి గ్రామ సర్పంచిగా పలు పర్యాయాలు పనిచేసినా.. ఆర్థికంగా స్థితిమంతుడేమీ కాదు. ఆగస్టు 24న ఆయన కొవిడ్‌ బారినపడ్డారు. రెండురోజుల పాటు ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్య కళాశాలలో, మరో 9 రోజుల పాటు అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో.. ఈనెల 3న హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఉండగా 8న మృతిచెందారు. లక్ష్మణ్‌రావును బతికించుకోవడానికి ఆయన కుటుంబం అనేక కష్టాలను ఎదుర్కొంది. ఆదిలాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.లక్షన్నర ఖర్చవగా.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌లో రూ.7 లక్షలకు పైగానే ఖర్చయింది. తెలిసినవారి వద్ద రూ. 9 లక్షల వరకు తెచ్చి కట్టారు. చివరకు అప్పు మిగిలిందే గానీ.. నాన్నను మాత్రం దక్కించుకోలేకపోయామని కుమారుడు ముఖేశ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక పక్క కుటుంబ పెద్ద లేని లోటు, మరోపక్క కొండలా పెరిగిన అప్పు.. ఈ రెండింటి నడుమ ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా సతమతమవుతోంది.
  • మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన ఒక చిరుద్యోగికి కరోనా సోకింది. ఉన్నట్టుండి శ్వాస సమస్య ఎదురైంది. హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరాడు. రెండువారాల చికిత్స అనంతరం కోలుకున్నాడు కానీ.. రూ. 10 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఎకరన్నర భూమి, ఇల్లు తాకట్టు పెట్టి కుటుంబ సభ్యులు అప్పు తెచ్చారు. అతడు ఊపిరి పీల్చుకుంటుండగానే.. తల్లి కొవిడ్‌ బారినపడింది. అప్పటికే ఆర్థికంగా చితికిపోవడంతో.. తాను చికిత్స పొందిన ఆసుపత్రిలో కాకుండా మరో ఆసుపత్రిలో తల్లిని చేర్పించాడు. అక్కడా రూ.5 లక్షల వరకూ ఖర్చయింది. అయినా ఆమె మృతిచెందింది. డబ్బుల్లేకనే పెద్దాసుపత్రిలో చేర్పించలేకపోయాననీ, చివరకు దక్కించుకోలేకపోయాననీ ఆయన కుమిలిపోయాడు. కొవిడ్‌ కోరల్లో చిక్కుకొని కేవలం మూడు వారాల్లో రూ.15 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. ఇప్పుడు పొలాన్ని అమ్మి అప్పు తీర్చాల్సి ఉందని ఆవేదన వెలిబుచ్చాడు.

ఇదీ చదవండి: నూతన విద్యా విధానంతో భారత్​కు విశ్వగురువు స్థానం: గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.