ETV Bharat / state

'శ్మశాన వాటికల్లో అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు' - తెలంగాణ వార్తలు

హైద‌రాబాద్​లోని కొన్ని శ్మ‌శాన వాటిక‌ల్లో అధిక‌ రుసుములు వసూలు చేస్తుండ‌టంపై జీహెచ్ఎంసీ చ‌ర్య‌లు తీసుకుంది. నిర్దేశించిన మేర‌కే వ‌సూలు చేయాల‌ని శ్మ‌శాన‌వాటిక‌ల వ‌ద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అధికంగా వ‌సూలు చేస్తే క‌ఠినంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

rates
rates
author img

By

Published : May 23, 2021, 4:16 PM IST

హైద‌రాబాద్‌ న‌గ‌రంలోని కొన్ని శ్మ‌శాన వాటిక‌ల్లో అధిక‌ రుసుములు వసూలు చేస్తుండ‌టంపై జీహెచ్ఎంసీ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలో నిర్దేశించిన మేర‌కే వ‌సూలు చేయాల‌ని శ్మ‌శాన‌వాటిక‌ల వ‌ద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అన్ని శ్మ‌శాన‌వాటిక‌ల్లో ఒకే విధంగా రుసుములు ఉండాల‌ని నిర్ణ‌యించిన బ‌ల్దియా ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకుంది.

సాధార‌ణ మృతుల అంత్య‌క్రియ‌ల‌కు రూ.6 వేలు.. కొవిడ్ మృతుల అంత్య‌క్రియ‌ల‌కు రూ.8 వేలు వ‌సూలు చేయాల‌ని శ్మ‌శానవాటిక‌ల నిర్వాహ‌కుల‌ను ఆదేశించింది. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అధికంగా వ‌సూలు చేస్తే క‌ఠినంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని జీహెచ్ఎంసీ స్ప‌ష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.