ETV Bharat / state

కరోనా భృతి రూ. 20వేలు చెల్లించాలి: దాసు సురేశ్ - జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్​

చేనేత సమస్యలపై.. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్​ తెలిపారు. లాక్​డౌన్​ వల్ల కుదేలైన చేనేత వృత్తులను అదుకొని.. కరోనా భృతిగా రూ. 20వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Statewide fasting on the 16th of this month
ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు
author img

By

Published : Jun 15, 2020, 10:49 PM IST

లాక్​డౌన్​ వల్ల కుదేలైన చేనేత వృత్తులను అదుకొని.. కరోనా భృతిగా రూ. 20వేలు చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసు సురేశ్​ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ స్పందించాలి..

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.క్రిష్ణయ్య సూచన మేరకు.. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలకే ట్విటర్​ ద్వారా స్పందించే మంత్రి కేటీఆర్​.. నేతన్నల చావులపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

ఇళ్లలోనే దీక్ష ..

ఉత్తర తెలంగాణకు ఆయువుపట్టుగా ఉన్న కాకతీయ మెగా టెక్స్​టైల్స్​ పార్క్ మూడేళ్లవుతున్నా ఎందుకు మొదలు పెట్టలేదని సురేశ్​ ప్రశ్నించారు. కరోనా భయం వల్ల చేతి వృత్తుల పనులు ఆగిపోయి ఉపాధి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలు నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి ఇళ్లలోనే దీక్ష చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: మరో తెరాస శాసన సభ్యుడికి కరోనా... గణేశ్‌ గుప్తాకు పాజిటివ్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.