రాష్ట్రంలోని దాదాపు 800 పోస్టల్ కార్యాలయాలను ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి తెలిపారు. తెలంగాణలో మొత్తం 835 పోస్ట్ ఆఫీసులకుగాను ప్రధాన ప్రాంతాల్లోని 37 పోస్టల్ కార్యాలయాలు మాత్రమే పని చేస్తాయని వివరించారు. రాష్ట్రంలో నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించినందున.. పోస్టల్ సేవలు అందించలేమని ఆమె పేర్కొన్నారు.
వాహనరాకపోకల పునరుద్ధరణ జరిగినప్పుడే పరిమిత సేవలను నిర్దేశిత చిరునామాలకు చేరవేస్తామని సంధ్యరాణి తెలిపారు. ఖాతాలున్న తపాల కార్యాలయాల నుంచి అపరిమిత మొత్తంలో నగదు తీసుకోవచ్చని, ఇతర పోస్టల్ కార్యాలయాల్లో ఖాతాలు ఉన్నవారు రోజుకు రూ. 25 వేలకు మించి నగదు తీసుకోడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు. పోస్టల్ ఏటీఎంలు యథావిధిగా పని చేస్తాయన్నారు. ఏటీఎంల నుంచి రోజుకు పదివేలు తీసుకోవచ్చని సంధ్యరాణి వెల్లడించారు.
ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...