ETV Bharat / state

ఉద్యోగుల అకుంఠిత దీక్ష ముఖ్యమంత్రికి తెలుసు: వినోద్​కుమార్ - Telangana news

తెలంగాణ ఉద్యోగుల సంఘం 2021 డైరీని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఉద్యోగుల అకుంఠిత దీక్ష ముఖ్యమంత్రికి తెలుసు: వినోద్​కుమార్

author img

By

Published : Feb 12, 2021, 10:20 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​... ఉద్యోగులకు అండగా ఉంటారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. కరోనా ప్రభావం నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పడిప్పుడే కోలుకుంటోందని... కుదుట పడగానే వాటి ఫలితాలు కనిపిస్తాయన్నారు. రానున్న రోజుల్లో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుందని వినోద్ కుమార్ తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర మంత్రులే పార్లమెంటు సాక్షిగా వెల్లడించారని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం 2021 డైరీని ఇవాళ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ ఛైర్మన్​ పద్మాచారి, అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం.రవీంద్ర కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వీడని చిక్కుముడి: పోలీసులను తప్పుదారి పట్టించిన ఫార్మసీ యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.