ETV Bharat / state

మూగజీవాల మందుల కోసం ఏడాదికి 7 రూపాయలే! - వరంగల్​లో ఆంత్రాక్స్​ కలకలం

రాష్ట్రంలో ఒక్కో మూగజీవి మందుల కోసం ప్రభుత్వం సగటున పెడుతున్న ఖర్చు రూ.7.40 మాత్రమే.. 3.24 కోట్ల మూగజీవాలకు (2020-21) బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.196 కోట్లు ఇవ్వగా.. ఈ ఏడాదీ అంతే మొత్తం కేటాయించింది. ఈ సొమ్ములో మందుల కొనుగోలుకు వెచ్చిస్తున్నది రూ.24 కోట్లు మాత్రమే అంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి.

livestock medicine in telangana
livestock medicine in telangana
author img

By

Published : Oct 31, 2021, 8:15 AM IST

రాష్ట్రంలో ఒక్కో మూగజీవి మందుల కోసం ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? రూ.7.40 మాత్రమే. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2.40 కోట్ల గొర్రెలు, మేకలు, 84 లక్షల ఆవులు, గేదె జాతి పాడి పశుసంపద, 8 కోట్ల బ్రాయిలర్‌ కోళ్లు, 1.75 కోట్ల నాటుకోళ్లున్నాయి. బ్రాయిలర్‌ కోళ్లకు అవసరమైన మందులను రైతులే కొంటున్నారు. నాటుకోళ్లకూ పశుసంవర్ధక శాఖ పెద్దగా మందులేమీ ఇవ్వడం లేదు. మిగిలిన 3.24 కోట్ల గొర్రెలు, మేకలు, పాడి పశువుల వైద్యానికి, మందులకు గత ఏడాది (2020-21) బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.196 కోట్లు ఇవ్వగా.. ఈ ఏడాదీ అంతే మొత్తం కేటాయించింది. ఈ సొమ్ములో మందుల కొనుగోలుకు వెచ్చిస్తున్నది రూ.24 కోట్లే. వీటిలోనూ 106 సంచార పశువైద్య వాహనాలకు రూ.5 కోట్లు కేటాయించింది. మిగిలిన రూ.19 కోట్లతోనే మందులను కొని పశువైద్యశాలలకు పంపుతున్నారు. జిల్లాస్థాయి పశువుల ఆసుపత్రికి ఏడాదికి మందులకు ఇస్తున్న సొమ్ము రూ.5 లక్షలే. ఈ విషయమై అధికార వర్గాలను వివరణ కోరగా.. అన్ని మూగజీవాలకు, కోళ్లకు రోగాలు రావని, వచ్చినవాటికి మాత్రమే వైద్యం చేస్తున్నందున నిధుల కొరత పెద్దగా ఉండదని తెలిపారు. పశువైద్యశాలలకు వెళ్తే చీటీ రాసిచ్చి బయట కొనుక్కోమంటున్నారని, కొన్ని రకాల మందులకు రూ.200 నుంచి 1000 దాకా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు.

సరఫరాలోనూ ఆలస్యం

నిధులను ప్రతి మూడు నెలలకోమారు నాలుగో వంతు చొప్పున విడుదల చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఒక నెల కూడా ముగిసినా రెండో త్రైమాసికానికి సంబంధించిన మందులు రాలేదని రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పశువైద్యాధికారి తెలిపారు. టెండర్ల ఆమోదానికి కొంత సమయం పట్టినందున రెండో త్రైమాసికానికి సంబంధించిన మందుల సరఫరా ప్రారంభించామని, అన్ని జిల్లాలకు వెళ్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మందుల కొనుగోలుకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ టెండర్లు పిలవగా.. గతేడాదితో పోలిస్తే 70 రకాల మందుల ధరలను పెంచుతూ కంపెనీలు టెండర్లు వేశాయి.

వ్యాధులు ప్రబలితే హడావుడి

అతి తక్కువగా నిధులివ్వడంతో రోగాల బారిన పడిన పశువులకు పూర్తిస్థాయిలో మందులు ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడైనా పెద్దఎత్తున వ్యాధులు ప్రబలితే అప్పటికప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు వేసి, మందులు పంపిణీ చేస్తున్నారు. తాజాగా వరంగల్‌ జిల్లా చాపలబండలో ఆంత్రాక్స్‌ ప్రబలి నాలుగు గొర్రెలు చనిపోవడంతో గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 5 గ్రామాలకు చెందిన 10 వేల మూగజీవాలకు హడావుడిగా టీకాలు వేయించింది.

ఇదీ చూడండి: TSRTC QR CODE: టీఎస్​ఆర్టీసీలో యూపీఐ చెల్లింపులు.. ప్రయాణికులకు సులభంగా లావాదేవీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.