నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన నేపథ్యంలో... నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20.68 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని ఎస్ఈసీ వివరించింది.
అధికార పార్టీ జోరు...
వైకాపా 570 స్థానాల్లో పాగా వేయగా తెదేపా ఐదు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఒక చోట భాజపా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఈసీ తెలిపింది.
ఇవీ చూడండి: నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు