అక్రమంగా దత్తతతో.. చిన్నారుల అక్రమ రవాణాకు దారి తీసే ప్రమాదం ఉందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొంది. దత్తత వ్యవహారాన్ని నిరోధించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్లను కోరింది.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి.. అనాథలుగా మారిన పిల్లలను అక్రమంగా దత్తత తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. దత్తత తీసుకునే విషయంలో.. చట్టపరమైన ప్రక్రియను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లను కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం