ETV Bharat / state

చెంతనే ముప్పు.. ఎప్పటికో కనువిప్పు..!

విద్యుత్తు ఉపకేంద్రాలు(సబ్‌స్టేషన్లు) నగరంలో చాలావరకు జనావాసాల నడుమ, రద్దీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వెలుగులు పంచే వీటి నిర్వహణలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పెనుముప్పు వాటిల్లుతుంది. శ్రీశైలంలోని జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంతో పాటు, ఇటీవల ఉపకేంద్రాల్లో జరిగిన ప్రమాదాలతో వీటి భద్రతపై ఎన్నో సందేహాలు నెలకొంటున్నాయి.

special story on hyderabad fire accidents
చెంతనే ముప్పు.. ఎప్పటికో కనువిప్పు..!
author img

By

Published : Aug 25, 2020, 10:08 AM IST

హైదరాబాద్​ నగరవ్యాప్తంగా విస్తరించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా డిస్కం ఇంటింటికి విద్యుత్తు సరఫరా చేస్తోంది. మొదట్లో విశాలమైన స్థలంలో వీటిని నిర్మించేవారు. స్థలాల కొరత, కొత్త సాంకేతికత అందుబాటులోకి రావడంతో కొద్ది స్థలంలోనే 220 నుంచి 33 కేవీ ఉపకేంద్రాలు నిర్మిస్తున్నారు. స్థలం తక్కువ ఉంటే ఇండోర్‌లోనే కట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు సబ్‌స్టేషన్లను పరిశీలించగా వెలుగుచూసిన లోపాలపై కథనం.

2017లో అతి పెద్ద ప్రమాదం

నగర విద్యుత్తు సరఫరా వ్యవస్థలోనే 2017 జులైలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఇమ్లీబన్‌లో 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లో 168 ఎంవీఏ నియంత్రిక(ట్రాన్స్‌ఫార్మర్‌) పేలింది. ఛార్జింగ్‌ చేసిన ఆరు నెలల్లోనే ఒక 168 ఎంవీఏ నియంత్రిక పేలింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. 40 అడుగులకు పైగా ఎగసిపడిన మంటలను ఆర్పేందుకు ఒకరోజు పట్టింది.

ప్రమాదాలకు వానాకాలమైతే పిడుగు పడటం కారణమని.. వేసవిలో అధిక లోడు కారమణమని అధికారులంటున్నారు. ఐదు రోజుల క్రితం నొయిడాలోని సబ్‌స్టేషన్‌లో జరిగిన అగ్నిప్రమాదం హడలెత్తించింది. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై నార్కట్‌పల్లిలోని సబ్‌స్టేషన్‌లో మేలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

అలారం మోగాలి

33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 8, 12 ఎంవీఏ నియంత్రికలుంటాయి. 220/132 కేవీ కేంద్రాల్లో 160 ఎంవీఏ సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేస్తారు. పలు దశల్లో రక్షణ వ్యవస్థలుంటాయి. ఏ మాత్రం తేడా ఉన్నా అలారం మోగుతుంది. ఎంజీబీఎస్‌లో ఈ వ్యవస్థలు పనిచేయలేదు.

ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం

సాధారణ, ఇండోర్‌ ఉప కేంద్రాలన్నింటిలో అగ్నిమాపక పరికరాలున్నాయి. మరింత మెరుగైన అగ్నిమాపక పరికరాలు హైదరాబాద్‌ నగరపాలకసంస్థ, అగ్నిమాపక కేంద్రాల వద్ద ఉన్నట్లు గుర్తించి, వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇటీవలి ప్రమాదంతో సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూస్తున్నాం.

- జె.శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌), టీఎస్‌ఎస్పీడీసీఎల్‌

గ్రేటర్‌ పరిధిలో సబ్‌స్టేషన్ల స్వరూపం

  • ట్రాన్స్‌కోకు చెందిన 132, 220, 400కేవీ: 50(సుమారు)
  • మొత్తం సబ్‌స్టేషన్లు 350
  • టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు చెందిన 33/11 కేవీ: 300(సుమారు)

సబ్‌స్టేషన్లలో ఇవీ లోపాలు..

  • అగ్నిమాపక పరికరాలు సరిగాలేవు. సిలిండర్లు పరిశీలిస్తున్న దాఖలాల్లేవు.
  • ఎరుపు రంగు బకెట్లను ఇసుకతో నింపి ఉంచుకోవాలి. చాలా స్టేషన్లలో కన్పించలేదు. ఉన్నవి ఆధ్వానస్థితిలో ఉన్నాయి.
  • శివార్లలో ఒకే ఉద్యోగి రోజుల తరబడి పనిచేస్తున్నాడు. 8 గంటలు లేదంటే ఒకరోజు విధులు అమలు కావడం లేదు.
  • భద్రత సమీక్షలు లేవనే విమర్శలున్నాయి. ఇదివరకు ప్రతి సర్కిల్‌కు ఒక భద్రతాధికారి ఉండేవారు. డిస్కం అయ్యాక ఆ పోస్టు ఎత్తేశారు.
  • ఏదైనా జరిగితే ఫీడర్లు ట్రిప్పు కావడం లేదు. ఎర్తింగ్‌ లోపాలు బయటపడుతున్నాయి. ప్రమాదంపై అప్రమత్తం చేయాల్సిన వ్యవస్థలు మొరాయిస్తున్నాయి.
  • పిడుగుపాటుకు గురికాకుండా ఏర్పాటు చేసిన లైటనింగ్‌ అరెస్టర్‌ నిర్వహణ సరిగా లేక పిడుగులు పడి పేలిపోతున్నాయి.
  • మాక్‌డ్రిల్స్‌ లేక ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై సిబ్బందిలో అవగాహన కొరవడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.