Delhi Liquor Scam Case Updates : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అందుకు అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. సీబీఐ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. ఏడుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదిస్తూ ఉత్తర్వుల్లో పలు అంశాలు ప్రస్తావించింది. ముడుపులిచ్చేందుకు అవసరమైన నగదు హవాలా మార్గంలో తరలించారని.. ఆ విషయంలో అభిషేక్ బోయిన్‌పల్లి కీలకపాత్ర పోషించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 20 నుంచి 30 కోట్లను.. హవాలా మార్గంలో తరలించినట్లు సీబీఐ ఛార్జిషీటులో తెలిపిందని ఆ మొత్తం ప్రభుత్వపెద్దల ప్రసన్నం చేసుకోవడానికి గాను.. విజయ్‌నాయర్‌కే ఇచ్చినట్లు తెలిపింది. 2021 జులై, సెప్టెంబర్ మధ్య దినేష్‌అరోరా ద్వారా విజయ్‌నాయర్‌కు చేర్చినట్లు పేర్కొంది.
దక్షిణాదికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి ఆ తతంగం అంతా నడిపినట్లు తెలిపింది. కొత్త మద్యం విధాన రూపకూల్పన సమయంలోనే.. నిందితులు కుట్రకు పాల్పడినట్లు ఛార్జిషీట్‌లో స్పష్టంచేసింది. దిల్లీ ప్రభుత్వముఖ్యులను ప్రభావితం చేసేందుకు.. హోల్‌సేల్ దారులు 12 శాతం లాభాలు ఆర్జించేలా, అందులో నుంచి తిరిగి 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి వచ్చేలా కుట్రచేశారని దర్యాప్తులో బయటపడినట్లు.. సీబీఐ తెలిపింది.
హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్ర పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు.. 4 కోట్ల 756 లక్షలు అందినట్లు నివేదించింది. గౌతమ్‌అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి 3.85 కోట్లు బదిలీ అయ్యాయని.. గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టంచేసింది. తద్వారా మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది.
ఇవీ చదవండి: