కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే నిరంతరంగా పలు నివారణ చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే అత్యధిక రద్దీ ఉండే ప్రధాన రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కార్యాలయాలు, సాధారణ బుకింగ్ కేంద్రాలు, ఏటీవీఎంలు, పార్సిల్ ఆఫీసుల వంటి ప్రదేశాల్లో తోటి ప్రయాణికులకు తగినంత దూరంగా ఉండేందుకు వీలుగా నేలమీద మార్కింగులు ఏర్పాటు చేశారు. స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసిన గీతల మార్కింగుల వల్ల పని పూర్తయ్యేవరకు క్యూలో వేచి ఉండే ప్రయాణికుల మధ్య ఒక మీటర్ దూరం పాటించబడుతుంది.
ప్రయాణికులకు మార్కింగుల పట్ల అవగాహన కల్పిస్తూ వారితో అనుసరింపజేయడానికి ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ఈ మార్కింగుల గురించి ప్రకటనలు ఇచ్చి ప్రయాణికులకు తెలియజేస్తున్నారు. ఇందువల్ల సేవా కేంద్రాల వద్ద క్యూ నిర్వహణ సులభతరమవుతోంది. అలాగే ప్రయాణికులు కూడా రైల్వే అధికారులకు సహకారం అందించి కరోనా వైరస్ను అరికట్టేందుకు తోడ్పడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో రక్తానికి కొరత