ETV Bharat / state

Bharat Gaurav train : మరో యాత్రకు 'భారత్​ గౌరవ్​ ట్రైన్​' ప్లాన్.. జూన్ 10న స్టార్ట్

Bharat Gaurav Train Special Package : దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడిచే భారత్ గౌరవ్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో అద్భుతంగా ఉందని రైల్వే శాఖ ప్రకటించించి. కాశీ.. పరిసర ప్రాంతాలకు ఇటీవల ట్రిప్పులకు 100 శాతం ఆకుపెన్సీతో ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. రైలు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ) భారతదేశంలోని ఇతర ప్రసిద్ధ, ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేసే విధంగా భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణ కోసం కొత్త టూరిస్ట్ సర్క్యూట్‌ ప్రణాళికను రూపొందించింది.

Bharat Gaurav trains
Bharat Gaurav trains
author img

By

Published : May 21, 2023, 2:04 PM IST

Bharat Gaurav Train Special Package : ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్​సీటీసీ).. మాతా వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు పేరిట కొత్త పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. జూన్ 10వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మాతా వైష్ణో దేవి ఆలయం, హరిద్వార్-రిషికేశ్‌ యాత్రకు భారత్ గౌరవ్ రైలు బయలుదేరనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ రైలు దేశంలోని ఉత్తర భాగంలోని ముఖ్యమైన యాత్రలు, చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రలోని ఏడు ముఖ్యమైన స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు సౌకర్యాన్ని కల్పించింది.

హరిద్వార్- రిషికేశ్‌తో మాతా వైష్ణోదేవి ప్రయాణించే ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్‌లతో పాటు మహారాష్ట్రలోని బల్హర్షా, వార్ధా, నాగ్‌పూర్‌లలో ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎక్కేవిధంగా, దిగేవిధంగా వెసులుబాటు కల్పించింది. ఈ రైలు కత్రా, ఆగ్రా, మధుర, బృందావన్, హరిద్వార్, రిషికేశ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేస్తుంది. వైష్ణో దేవి ఆలయం కోసం కత్రా నుంచి ఆలయానికి వెళ్లాలనుకునే పర్యాటకులు పోనీ, డోలీ, హెలికాప్టర్ సర్వీస్ ద్వారా తమ వ్యక్తిగతంగా వారే బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ వెల్లడించింది.

Bharat Gaurav train starts from Secunderabad : మొత్తం ట్రిప్​లో 8 రాత్రులు, 9 పగళ్ల కాల వ్యవధిలో కవర్ చేస్తారు. ప్రయాణికులకు తగిన రైళ్లు, వసతి, ఆహారం మొదలైన అన్ని సంబంధిత ఏర్పాట్లు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా ప్లాన్ చేయడంలో ఉన్న అన్ని ఇబ్బందులను నివారించి ఈ రైలులో మంచి సౌకర్యం, వసతులను పర్యాటకులకు కల్పిస్తుంది అని రైల్వే శాఖ భరోసా ఇస్తోంది. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు రైలు, రోడ్డు రవాణాతో పాటు, వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్, ఆన్-బోర్డ్, ఆఫ్-బోర్డ్ రెండు సౌకర్యాలు కల్పించారు.

ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్‌ సేవలు అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల భద్రత కోసం రైలులో అన్ని కోచ్‌లలో సీసీ కెమెరాలు అమర్చారు. అన్ని కోచ్‌లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సౌకర్యం, ప్రయాణ బీమాతో పాటు.. సహాయం కోసం ప్రయాణం అంతటా ఐఆర్​సీటీసీ టూరిస్టు మేనేజర్‌లు అందుబాటులో ఉంటారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్​సీటీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

వీటిని సంప్రదించండి : http://www.irctctourism.com బుకింగ్ లింక్‌తో https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG05 లో సంప్రదించాలని కోరింది. వీటితో పాటు సికింద్రాబాద్ ఆఫీస్ 9701360701, 8287932228, 9110712752 ఫోన్ నంబర్లను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.