లెక్క తేలిందిలా..
ఇటీవల సికింద్రాబాద్ సర్కిల్‌కు బదిలీపై వెళ్లిన ఆడిట్ అధికారి పెన్షన్ల చెల్లింపులను పరిశీలించారు. 2011 సంవత్సరం నుంచి గతేడాది వరకు వేర్వేరు తేదీల్లో ఆగిపోవాల్సిన పూర్తి పెన్షన్ చెల్లింపులను, గతంలోని అధికారులు అలాగే కొనసాగించినట్లు ఆయన గుర్తించారు. విలువ లెక్కగట్టి 14 మందికి అదనంగా రూ.51.80 లక్షలు చెల్లించినట్లు రూఢీ చేశారు. ఈ విషయం కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లింది. ఇప్పుడు అవకతవకలపై విచారణ చేయాల్సిన కేంద్ర కార్యాలయం సరైన రీతిలో వ్యవహరించలేదని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు బాలకృష్ణ ‘ఈనాడు’తో తెలిపారు.
ఆడిట్ విభాగానికి గంతలు..
ఏడాది క్రితం బల్దియా సికింద్రాబాద్ జోన్‌లో ఇదే తరహా అవినీతి ఘటన బయటపడింది. సుమారు పది మంది అధికారులకు అదనంగా రూ.50 లక్షల మేర పెన్షన్ నిధులు మంజూరు చేశారు. విచారణలో నిజమని తేలడంతో ఆ నిధులను అధికారులు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే జోన్‌లోని ఆరోగ్య విభాగంలో 100 మందికిపైగా ఈ తరహాలో అదనపు పెన్షన్ అందుతోందని సికింద్రాబాద్ సర్కిల్ ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. వాస్తవానికి సర్వీసులో చనిపోయిన ఉద్యోగి భార్య/భర్తకు లేదా వారసులకు (వయసు 25 యేళ్లు వచ్చే వరకు) చట్టప్రకారం ప్రభుత్వం నుంచి ఏడేళ్లపాటు పూర్తి ఫ్యామిలీ పెన్షన్ ప్రతినెలా అందుతుంది. అనంతరం అందులో 30 శాతం వరకు తగ్గుతుంది. అది చూసే ప్రతినెలా బిల్లులు చేయాలి. జీహెచ్‌ఎంసీలోని పలువురు అధికారులు కొందరికి యేళ్ల తరబడి పూర్తి పెన్షన్ ఇస్తున్నారు.
ఇవీ చూడండి: సెప్టెంబరు 1 నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్ తరగతులు