ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయం, రైతుల సమస్యలకు సహకారం రంగం ద్వారానే పరిష్కారం లభిస్తుందని కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్ తెలిపారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిల భారత కిసాన్ సభను థామస్ ఐజాక్ ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజలను సంఘటిత పరచడంలో సహకార రంగం కీలకమవుతుందన్నారు. కేరళలో కూడా ఇదే తరహాలో జరిగిందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ స్పష్టం చేశారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర రావట్లేదని పేర్కొన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తోన్న ఆహార ఉత్పత్తుల కంటే దిగుమతి అవుతున్నవే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు .
ఇవీ చూడండి : తెలుగు రాష్ట్రాలకు ఒక్కటంటే ఒక్క కొత్త రైలు లేదు