నిత్యం వందలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పాము కలకలం రేపింది. ఎంజీబీఎస్‌లోని 61వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద ఉన్న పామును చూసి కొందరు ప్రయాణికులు పరుగులు తీశారు. సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ సొసైటీ సభ్యులు పామును పట్టుకుని జూ పార్కుకు తరలించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు