ETV Bharat / state

'స్మోక్​ ఫ్రీ హైదరాబాద్' మన లక్ష్యం కావాలి​ - eetala

సిగరెట్ తాగొద్దు.. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు అంటూ.. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లో అవగాహనా పరుగు ఉత్సాహంగా సాగింది. రేపు వరల్డ్​ నో టొబాకో డేకు మద్దతుగా బల్దియా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా దీనిని చేపట్టాయి.

పరుగు
author img

By

Published : May 30, 2019, 6:33 PM IST

'స్మోక్​ ఫ్రీ హైదరాబాద్' మన లక్ష్యం కావాలి​

శుక్రవారం వరల్డ్​ నో టొబాకో డే సందర్భంగా ఈరోజు నెక్లెస్ రోడ్​లో 'స్మోక్​ ఫ్రీ హైదరాబాద్' పేరిట పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జెండా ఊపి ​ ప్రారంభించారు. ఈ పరుగులో 200 మంది పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారిపై కఠిన ఇక నుంచి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమం డిపార్టమెంట్​ ఆఫ్​ హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​, గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో జరిగింది. రానున్న 4 నెలల్లో భాగ్యనగరాన్ని ధూమపానరహితంగా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ 'స్మోక్​ ఫ్రీ హైదరాబాద్'​ పరుగులో అపశృతి చోటుచేసుకుంది. పరుగులో పాల్గొనేందుకు వచ్చిన ఓ నర్సింగ్​ విద్యార్థినిని కారు ఢీకొంది. ఆ ఘటనలో విద్యార్థినికి గాయాలయ్యాయి. ఇవీ చూడండి: పదోతరగతి ప్రతిభావంతులకు పురస్కారాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.