తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో స్వల్పంగా మంటలు చెలరేగాయి. హరియణా బల్లభ్‌గఢ్ వద్ద తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 9వ నంబర్ కోచ్ కిందభాగంలో దట్టమైన పొగలతో కూడిన మంటలు రావడాన్ని గమనించిన అధికారులు రైలును నిలిపివేశారు. అదేమార్గంలో నడిచే మిగిలిన వ్యాగన్లూ నిలిపివేశారు. మంటలు రావడానికి కారణమేంటో రైల్వే సిబ్బంది పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆట రూటు మారుతోంది... బాల్యం బంధీ అవుతోంది!